సుక్కు ఈ హీరోని ప్లాఫ్ ల నుంచి బయిట పడేస్తాడా?

రీసెంట్ గా రంగస్దలం వంటి సూపర్ హిట్ చిత్రం ఇచ్చారు సుకుమార్. ఆయన దర్శకత్వంలో చేయాలని చిన్న,పెద్ద దర్శకులంతా ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే ఆయన స్టార్స్ హీరోస్ తో జర్నీ చేస్తున్నారు. మరి ఆయనతో చేయాలనుకున్న హీరోలకు తను కథ ఇవ్వటమో లేక తన నిర్మాతగా సినిమా చేయటమో చేస్తున్నారు.

అలాగే ఆ మధ్యన సుకుమార్ నిర్మాతగా మారి సుకుమార్ రైటింగ్స్ పతాకంపై కుమారి 21ఎఫ్ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఆయనే స్వయంగా కథ, కథనాల్ని సమకూర్చారు. యూత్ ఆలోచనలను ఆవిష్కరిస్తూ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రం పెద్ద సినిమాల స్థాయిలో వసూళ్లను సాధించింది. దాంతో ఆయన నిర్మతగా చేసే సినిమాల్లో అయినా చేయాలని కుర్ర హీరోలు క్యూ కడుతున్నారు. అలాంటి హీరోల్లో నాగ శౌర్య ఒకరు. అతనితో ఓ సినిమా చేయటానికి సుకుమార్ ఉత్సాహం చూపిస్తున్నారు.

కుమారి 21ఎఫ్ చిత్రం అందించిన విజయోత్సాహంతో సుకుమార్ మరో సినిమాను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. నాగశౌర్య ఇందులో హీరోగా నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతల్ని సుకుమార్ తన శిష్యుడు కాశి కు అప్పగించినట్లు తెలిసింది.

విభిన్న కథ, కథనాలతో రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే కథా చర్చలు పూర్తయినట్లు సమాచారం. ఇదొక రొమాంటిక్ డ్రామా అని, నిథి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా చేయనుందని టాక్. అతి త్వరలోనే ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకురానున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.