‘గ్యాంగ్ లీడర్ పై నాని ఆశలు!

‘గ్యాంగ్ లీడర్ పై నాని ఆశలు!

నాని హీరోగా విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సివిఎం) నిర్మిస్తున్న ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంపై నాని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇందులో నాని పాత్ర అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ చెబుతున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన  ప్రీ లుక్ పోస్టర్ విడుదల అయింది. . ‘నేను గ్యాంగ్ లీడర్… మా గ్యాంగ్ రెడీగా ఉంది…’ అని నాని ప్రీ లుక్ పోస్టర్ ని సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. సినిమా సబ్జెక్టు కి అనుగుణంగా డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఆసక్తి రేపేలా ఉండి మంచి రెస్పాన్స్ రాబట్టింది. నాని ‘గ్యాంగ్ లీడర్’  ఫస్ట్ లుక్ పోస్టర్జు ని ఈ నెల 15 న విడుదల చేయనున్నారు. అలాగే ఫస్ట్ సాంగ్ ని 18 న, టీజర్ ని  24 న రిలీజ్ చేయనున్నారు. సినిమా ఆగష్టు 30 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధమవుతోంది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.  

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో  ఒక ప్రధాన పాత్ర ఆర్ఎక్స్ 100 ఫేమ్  కార్తికేయ పోషిస్తున్నారు. ఈ చిత్రం లోని పాత్ర ప్రతీ ఒక్కరినీ కదిలిస్తుందని, నాని కెరీర్ లో గొప్పగా నిలిచిపోయే చిత్రమవుతుందని దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ చెప్పారు