నాని సినిమాలో చిరంజీవి.! సాధ్యమేనా.?

నేచురల్ స్టార్ నాని గతంలో, ‘కింగ్’ అక్కినేని నాగార్జునతో కలిసి ఓ సినిమా చేశాడు. ఆ సినిమా పేరు ‘దేవదాస్’.! రష్మిక మండన్న, నానికి జోడీగా నటించింది ఆ సినిమాలో.

మరో సీనియర్ హీరోతో కలిసి నాని ఓ సినిమా చేయబోతున్నాడా.? ఆ సీనియర్ హీరో ఇంకెవరో కాదు, మెగాస్టార్ చిరంజీవేనా.? ఔననే చర్చ జరుగుతోంది సినీ వర్గాల్లో. ఓ యంగ్ హీరో చెప్పిన కథని, మెగాస్టార్ చిరంజీవి దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నాల్లో వున్నాడట నాని.

చిరంజీవి పాత్ర నిడివి తక్కువే వుంటుందిగానీ, చాలా ఎఫెక్టెవ్‌గా వుండబోతోందిట. అవసరమైతే, ఆ రోల్‌ని ఫుల్ లెంగ్త్‌కి పెంచేందుకూ స్క్రిప్టులో స్కోప్ వుందట. చిరంజీవి ఓకే అంటే, స్వీయ నిర్మాణంలో ఆ సినిమా తెరకెక్కించాలని నాని అనుకుంటున్నాడట.

నాని అంటే మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్.! ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినా, చిరంజీవికి అభిమాని కాని నటుడంటూ ఎవరుంటారు.?

మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సినిమా ‘గ్యాంగ్ లీడర్’ని, నాని తన సినిమాకి పెట్టుకున్నాడు కొన్నాళ్ళ క్రితం.