స్టార్ డైరెక్ట‌ర్ పై హ‌త్యా య‌త్న‌మా?

త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ సుశీంద్ర‌న్ పై హ‌త్యా య‌త్నం జ‌రిగిందా? అంటే అవున‌నే సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది. అస‌లింత‌కీ ఏమైంది? అంటే.. ఈ శుక్ర‌వారం మోర్నింగ్ వాక్ కి వెల్లిన సుశీంద్ర‌న్ ని ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి అనుమానాస్ప‌దంగా యాక్సిడెంట్ చేశారు. ఈ యాక్సిడెంట్ లో అతడు సేఫ్ అయినా సుశీంద్ర‌న్ కి మాత్రం తీవ్ర గాయాల‌య్యాయి. చెయ్యి విరిగింది. శ‌రీరంలో ర‌క‌ర‌కాల చోట్ల దెబ్బ‌లు గ‌ట్టిగా త‌గిలాయిట‌.

ఇది ఉద్ధేశ‌పూర్వ‌క‌మైన యాక్సిడెంట్ అంటూ పోలీసులు కేసును న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఆ కోణంలోనే విచారిస్తున్నార‌ని తెలుస్తోంది. అయితే సుశీంద్ర‌న్ కి శ‌త్రువులు ఎవ‌రైనా ఉన్నారా? అంత‌గా శ‌త్రువుల్ని పోగేసుకున్నారా? అంటూ ప‌రిశ్ర‌మ‌లో కొత్త చ‌ర్చ మొద‌లైంది. నా పేరు శివ లాంటి క్లాసిక్ హిట్ ని తెర‌కెక్కించిన సుశీంద్ర‌న్ విశాల్- కార్తీ వంటి టాప్ హీరోల‌తో సినిమాలు తీశారు. అగ్ర హీరోలు అత‌డితో ప‌ని చేసేందుకు ఆస‌క్తిగా ఉంటార‌న్న సంగ‌తి తెలిసిందే.