ప్రపంచ వ్యాప్తంగా ఘన విజయం సాధించిన బాహుబలి తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సాహో. బాహుబలితో ప్రభాస్‌కు జాతీయ స్థాయిలో స్టార్ ఇమేజ్ రావటంతో సాహోను కూడా అదే స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ 300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
కారు ఛేజింగ్‌లు, ఫైట్లతో ‘సాహో’ సినిమాను భారీ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ‘సాహో’ సినిమా ఈ రోజు షూటింగ్ పూర్తయిందని మురళీ శర్మ ట్వీట్ చేశారు. ఛేజ్ సన్నివేశాన్ని పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి బయలుదేరినట్లు తెలిపారు. ముంబయిలోని ఆంబే వ్యాలీలో షూటింగ్ జరిగినట్లు పేర్కొన్నారు.
దీంతోపాటు పూర్తిగా ధ్వంసమైన కారును తరలిస్తుండగా తీసిన వీడియోను షేర్ చేశారు. ఛేజింగ్ కోసం ఉపయోగించడం వల్ల ఆ కారు అలా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఈ వీడియోను చూసిన ఫ్యాన్స్ సినిమా ఓ ట్రీట్ కాబోతోందని పండగ చేసుకుంటున్నారు.
It’s a wrap n on our way back home after filming a chase #Saaho #Ambeyvalley #chasesequence pic.twitter.com/vPd5j18Hyc
— Murali Sharma (@murlisharma72) May 19, 2019
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సాహో ఓవర్ సీస్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైనట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ఓవర్ సీస్ హక్కులు దాదాపు 42 కోట్లకు అమ్ముడైనట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఈ చిత్రంలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. నీల్ నితిన్ ముకేష్, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 15న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.