విజయవాడ మల్టీప్లెక్స్ లో సినిమాలే సినిమాలు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో క్రమంగా సినిమా థియేటర్లు పెరుగుతున్నాయి . అమరావతి రాజధాని ఇంకా నిర్మాణ దశలో  ఉండగా విజయవాడలో సినిమా థియేటర్లు బాగా వస్తున్నాయి . ముఖ్యంగా మల్టీప్లెక్స్  కల్చర్  క్రమంగా  విజయవాడలో విస్తరిస్తోంది . ప్రతి ఆర్టీసీ  బస్సు డిపోలో  చిన్న థియేటర్లు  నెలకొల్పాలనే ప్రతిపాదన వచ్చింది . దీనిని ప్రభుత్వం అమలు చేస్తుంది . ప్రస్తుతం విజయవాడ బస్సు డిపోలో సినిమాలను ప్రదర్శిస్తున్నారు .

ఇక విజయవాడలో ఇప్పటికే ఐనాక్స్ , పీవీపీ , పీవీఆర్  మొదలైనవి వచ్చాయి . అయితే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మల్టీప్లెక్స్  థియేటర్ లకు అదనపు ఆటలు ప్రదర్శించు కోవడానికి అనుమతి మంజూరు చేసింది .  ఈ థియేటర్లలో  ప్రతిరోజూ ఉదయం  8 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటలవరకు సినిమాలను ప్రదర్శించుకోవచ్చునని  ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిసింది .

సో ఇక బెజవాడకు అదనంగా సినిమాలు ప్రదర్శించుకొని అనుమతి రావడంతో వాటి యజమానులంతా సంతోషంగా ఉన్నారట . మొత్తానికి చంద్ర బాబు ముందు చూపుతో ఈ అనుమతి ఇచ్చారని అనుకుంటున్నారు .