మెగా ఆర్ట్స్ పతాకంపై వాడపల్లి జగన్నాథం సమర్పణలో రాజ్ వాడపల్లి నిర్మిస్తోన్న చిత్రం `మొనగాడెవరు`. చిత్రం ప్రారంభోత్సవంఈరోజు హైదరాబాద్‌లో ని రామానాయుడు స్టూడియోలో జరిగింది.
రాజ్ వాడపల్లి, వంశీకృష్ణ, ప్రియా అగస్టి, కావ్య కీర్తి బండారి లు హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రానికి కుమార్ రాజేంద్ర దర్శకుడు. `మా` అధ్యక్షుడు శివాజీరాజా తొలి సన్నివేశానికి క్లాప్ నివ్వగా దర్శకుడు బి.గోపాల్ కెమేరా స్విచాన్ చేశారు. ప్రతాని రామకృష్ణ గౌడ్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత రామ సత్యనారాయణ టైటిల్ లోగో ను ఆవిష్కరించాడు .
నిర్మాత రాజ్ వాడపల్లి మాట్లాడుతూ….“సినిమాలో సినిమాగా `మొనగాడెవరు` చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ సినిమాలో వచ్చిన 50% లాభాలను సినిమా పరిశ్రమలోని పేద కళాకారులకు ఇవ్వనున్నాం. మా తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం“ అన్నారు.
చిత్ర దర్శకుడు కుమార్ రాజేంద్ర మాట్లాడుతూ…“ మా సినిమాలో వినోదంతో పాటు సామాజిక అంశాలు కూడా ఉన్నాయి. సినిమా రంగంలో నిలదొక్కుకోవాలని వచ్చిన నలుగురు యువతీ యువకులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? చివరికి వారి కోరిక నెరవేరిందా? లేదా అన్నది సినిమా కథాంశం. మరో వైపు చిత్తూరు నాగయ్య దగ్గర నుంచి మెగాస్టార్ వరకు సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ఎలాంటిఇబ్బందులు పడ్డారు అన్నది చూపిస్తున్నాం. “ అన్నారు.
ఇందులో బస్టాప్ కోటేశ్వరరావు, హేమసుందర్, శివ శంకర్ మాస్టర్, బిత్తిరి సత్తి, కృష్ణవేణి, రాగిణి, ఎన్టీఆర్ డూప్ గా భాస్కర్, చిరంజీవిగా డూప్ గా ధర్మతేజ, శోభన్ బాబు డూప్ గా వెంకటేశ్వరరావు, బాలకృష్ణ డూప్ గా రామకృష్ణ నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతంః ఎమ్ ఎల్ రాజు; ఆర్ట్ః వెంకటేష్ గూళ్ల; ఫైట్స్ః అశోక్ రాజు; పాటలుః అంచుల నాగేశ్వరరావు; ఎడిటర్ః స్వామి; డాన్స్ః అజయ్ శివశంకర్, సతీష్ రాజ్; సినిమటోగ్రఫీః ఎమ్.మురళి; కో`డైరక్టర్ః బియన్ రెడ్డి; ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ః విజయ్ కుమార్ గుర్రం; నిర్మాతః రాజ్ వాడపల్లి; కథ-మాటలు-స్ర్కీన్ ప్లే-దర్శకత్వంః కుమార్ రాజేంద్ర.