కంగారుపడకండి ఇదో కొత్త సినిమాలో డైలాగే…అయితే ఆ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. ట్రైలర్ రిలీజైంది. ప్రజెంట్ డేస్ లో యూత్ మాట్లాడుకునే మాటలని గుది గుచ్చి చేసినట్లు అనిపిస్తుందీ ఈ ట్రైలర్ చూస్తూంటే. ఇంతకీ ఏం సినిమాకు సంభందించి అంటారా..
తెలుగు సినిమా రూపు మారుతోంది. కొత్త తరహా సినిమాలకు ఆహ్వానం పలుకుతోంది. తాజాగా ఆ విషయాన్ని మరోసారి నొక్కి చెప్పింది ‘మిఠాయి’ చిత్రం ట్రైలర్. కార్పొరేట్ ఉద్యోగాలకు కుర్రకారు ఎగబడుతున్న విషయాన్ని బ్యాక్ గ్రౌండ్ గా తీసుకుని డార్క్ క్యామెడీతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి కావొచ్చింది.. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ట్రైలర్ చాలా బాగుందంటూ టీమ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “నేను.. వాడు ఇక్కడ పాయిఖానాలు కడిగేటందుకు వచ్చినామారా హౌలే”.. అంటూ ప్రియదర్శి చెప్పే డైలాగులు హైలెట్ గా ఉన్నాయి. ఇక్కడ ట్రైలర్ చూడండి.
గాయత్రి గుప్తా, శ్వేతా వర్మ, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్య తారలుగా స్వీయ దర్శకత్వంలో ప్రశాంత్ కుమార్ రూపొందుతున్న మూవీ ‘మిఠాయి’. కార్పొరేట్ సంస్థలు సాలేగూళ్లు అంటూ అందులో చిక్కితే బయటపడలేమంటూ ఆ మధ్యన రాహుల్ రామకృష్ణ స్పీచ్ తో టీజర్ ను కట్ చేసారు కదా ఆ టీమే.. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, ఎగ్జిక్యూ టివ్ ప్రొడ్యూసర్: కృష్ణ వొడవల్లి.