వివాదం లేనిదే పెద్ద సినిమా ఉండదేమో..ముఖ్యంగా రాజకీయాల నేపధ్యంలో వచ్చిన చిత్రాలకు వివాదాలు తప్పనిసరి అవుతున్నాయి. జనాలను కనెక్ట్ చేసేందుకు తాజా రాజకీయ పరిణామాలను తమ సినిమాల్లో కూర్చే విజయ్ వంటి స్టార్స్ కు సమస్యలు తప్పటం లేదు. మొన్నామధ్య విజయ్ చిత్రం మెర్సిల్ (అదిరింది)కు వివాదం అయ్యింది. సినిమాలో ప్రభుత్వాన్ని విమర్శించే జీఎస్టీ, వ్యవస్థలోని లోపాలపై తీసిన సీన్స్ ను తొలగించాల్సిందిగా కొంతమంది రభస చేశారు. అది సినిమా పబ్లిసిటీకు బాగానే ఉపయోగపడింది. అయితే వివాదం రోజు రోజుకూ ముదరటంతో …చివరగా వాటికి సంబంధించిన సీన్స్ లో డైలాగులను కట్ చేశారు. ఇప్పుడు మరోసారి విజయ్ అలాంటి వివాదాన్నే ఎదుర్కొంటున్నారు.
వివరాలలోకి వెళితే… రీసెంట్‌గా మొన్న బుధవారం ..దీపావళి కానుకగా విడుదలైన సర్కార్ చిత్రం తెలుగు విషయం ప్రక్కన పెడితే తమిళనాట… కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. చెన్నైలో దాదాపు 70 స్కీన్‌లో విడుదల చేయగా భారీ కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఓవర్సిస్‌లో సైతం సర్కార్ సునామిని సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాలో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని రిలీజ్‌చేశారు.
వివాదం ఏంటి
ఈ సినిమా ఓటు హక్కుని సక్రమంగా వినియోగించుకోండి అని చెప్తూనే రాజకీయ నాయకులకు చురకలు అంటించారు. వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్రలో జయలలితను ఇండైక్ట్ చూపించారు. అది నెగిటివ్ పాత్ర. అయితే సినిమా టీమ్ ఊహించినట్లుగానే ఆ పాత్ర తమిళనాట బాగానే పట్టింది. జనం అంతా ఆ గెటప్ గురించే మాట్లాడుకుంటున్నారు. దాంతో సమస్య కూడా ఆ పాత్ర తోటే వచ్చి చేరింది.
సర్కార్ సినిమాలో ..జయలలితను తప్పుగా చూపించారంటూ అన్నాడీఎంకే మంత్రులు మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన సీన్స్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారి చేసారు. ఇప్పుడిప్పుడే రాజుకుంటున్న ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించిన ఈ సినిమాకు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. కీర్తి సురేష్, వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించారు.