ట్రోల్స్ పడుతున్నా “ఆదిపురుష్” టీజర్ కి మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.!

ఇప్పుడు టాలీవుడ్ సహా బాలీవుడ్ సినిమా దగ్గర కూడా భారీ అంచనాలు నెలకొల్పుకుని ఉన్న చిత్రాల్లో పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ కూడా ఒకటి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో బాలీవుడ్ నేషనల్ అవార్డు విన్నింగ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్న మోస్ట్ అవైటెడ్ ఇండియన్ సినిమాగా నిలిచి ఉంది.

అయితే ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్ తో అయితే ఒక్కసారిగా అందరికీ దిమ్మ తిరిగింది. ఆదిపురుష్ టీజర్ దారుణంగా ఉండడంతో మొదటి రోజు నుంచే దారుణమైన ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక ఈ భారీ చిత్రం టీజర్ కి ఇలాంటి ట్రోల్స్ పడుతున్నా కూడా వరల్డ్ వైడ్ రికార్డు బ్రేకింగ్ రెస్పాన్స్ ని ఈ టీజర్ అందుకుంది.

ఈ టీజర్ జస్ట్ 24 గంటల్లో ఏకంగా 100 మిలియన్ వ్యూస్ అందుకున్న టీజర్ గా వరల్డ్ రికార్డు సృష్టించిందట. అయితే ఇది హిందీ సహా తెలుగు అన్ని భాషల్లో అన్నట్టు చిత్ర యూనిట్ అనౌన్స్ చేశారు. ఈ పేలవమైన గ్రాఫిక్స్ తోనే ఈ రేంజ్ రెస్పాన్స్ అంటే అంచనాలకి తగ్గట్టుగా ఉన్నట్టు అయితే ఇంకే స్థాయిలో రెస్పాన్స్ ఉండేదో మనం అర్ధం చేసుకోవాలి.

ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో సైఫ్ అలీఖాన్, కృతి సనన్ లు నటించగా వచ్చే ఏడాది ప్రపంచ వ్యాప్తంగా జనవరి 12న రిలీజ్ కాబోతుంది.