సైఫ్ అలీ ఖాన్ సంచలన ప్రకటన

సినిమా రంగంలో మహిళలను కేవలం ఆనందాన్నిచ్చే వారిగానో సుఖాన్ని పంచేవారిగానో చూసే రోజులు పోయాయని, వారిని కూడా మగవారితో  సమంగా చూడాలని, అలా కాకుండా మహిళా కళాకారులను మానసికంగా వేధించేవారితో కలసి తానునటించనని  హిందీ హీరో సైఫ్ అలీ ఖాన్ సంచలన ప్రకటన చేశాడు.


తనుశ్రీ దత్త, తనని నటుడు నానా పాటేకర్ “హార్న్ ఓక్ ప్లేసస్స్” సెట్స్ పై వేధించినట్టు ఆరోపణ చేయడంతో బాలీవుడ్ లో స్త్రీలు ఏరకమైన మానసిక, శారీరక వత్తిడికి లోనవుతున్నారో ప్రపంచానికి తెలిసింది .. తనుశ్రీ ప్రకటన బాలీవుడ్లో ప్రకంపనలు సృష్టించింది. అక్కడ నుంచి “మీ టూ ” ఉద్యమము  ప్రారంభమైంది. చాలామంది తమకు జరిగిన అనుభవాలను ధైర్యంగా చెబుతున్నారు. ఇప్పటివరకు గౌరవప్రదంగా  ఉన్నవారంతా ఒకప్పుడు నటీమణులను తమ కోరికలు తీర్చమని వేధించినవారేనని వెల్లడయ్యింది. ఈ విషయంలో అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నాడనే
విషయం వెలుగులోకి వచ్చింది.


ఇప్పుడు దీనిపై సైఫ్ అలీ ఖాన్ స్పందించాడు. సైఫ్ అలీఖాన్ ఒకప్పటి హీరోయిన్ షర్మిలా ఖాన్, క్రికెటర్  మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ  కుమారుడు. సైఫ్  1993లో యాష్ చోప్రా నిర్మించిన “పరంపర ” చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. 2004లో “హమ్ తుమ్ ‘అనే సినిమాలోని నటనకు జాతీయ అవార్డు అందుకున్నాడు. 2012లో మొదటి భార్య అమృత సింగ్ కు విడాకులు ఇచ్చి కరీనాకపూర్ ను వివాహం చేసుకున్నాడు. ఇంత
పెద్ద కుటుంబం నుంచి వచ్చిన సైఫ్ అలీ ఖాన్ కూడా తొలి నాళ్లలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడట. జూనియర్ ను కావడంతో మానసికంగా బాగా వేధించారని, ఆ విషయాలను తెలుసుకుంటే ఇప్పటికీ బాధ కలుగుతుందని చెప్పాడు. అందుకే మహిళా కళాకారులు, సాంకేతిక నిపుణులను వేధించే వారిపట్ల కఠినంగా వుండాలని చెబుతున్నాడు. ఆరోపణలు వచినవారితో తాను  పనిచేయనని తేల్చి చెప్పాడు.