మెగాస్టార్ `ప్రాణం ఖ‌రీదు` లుక్ మెగా ప్రిన్స్‌కి రిఫ‌రెన్స్

ఇమ్మిటేష‌న్ న‌చ్చ‌ద‌న్న మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్

రీమేక్ లు అంటేనే ఓ స‌వాల్. ఆ ప‌ని చేసేప్పుడు ద‌ర్శ‌కుడికే కాదు ఆర్టిస్టుకు చాలా స‌వాళ్లు ఎదుర‌వుతాయి. ఒక న‌టుడు ఆల్రెడీ ప్ర‌శంస‌లు పొందిన పాత్ర‌ను తిరిగి రిపీట్ చేస్తూ అందులో న‌టింలంటే చాలానే ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. త‌మిళ చిత్రం `జిగ‌ర్తాండ`కు జాతీయ అవార్డు వ‌చ్చింది. అందులో న‌టించిన బాబీ సింహా గొప్ప న‌టుడు అంటూ కితాబిచ్చారు త‌మిళ‌ జ‌నం. అలాంటి సినిమాని తీసుకుని హ‌రీష్ శంక‌ర్ తెలుగులో `వాల్మీకి` పేరుతో తెర‌కెక్కించారు. ఈ సినిమాకు వ‌రుణ్ పూర్తి స్థాయిలో న్యాయం చేశారా? అంటే ఈనెల 20న ఏ మేర‌కు చేశాడు అన్న‌ది తేల‌నుంది.

బాబీ సింహాకు ఇమ్మిటేష‌న్ కాదు

ఈ రీమేక్ లో వ‌రుణ్ తేజ్ య‌థాత‌థంగా బాబీ సింహాను కాపీ కొట్టి న‌టించాడా? అంటే లేనేలేద‌ని తాజాగా హైద‌రాబాద్ లో జ‌రిగిన ప్ర‌చార‌ ఇంట‌ర్వ్యూలో వ‌రుణ్ తేజ్ తెలిపారు. వాల్మీకి చిత్రంలో నా పాత్ర‌ను పూర్తిగా కొత్త‌గా మ‌లిచారు. బాబీ సింహాను ఇమ్మిటేట్ చేయాల‌ని నేను అనుకోలేదు. త‌న‌కంటే కొత్త‌గా ఎలా చేయాలి? అన్న‌ది ప్ర‌య‌త్నించాన‌ని అన్నారు. జాతీయ అవార్డ్ పొందిన సినిమా జిగ‌ర్తాండ‌. అలాంటి చిత్రాన్ని తెలుగైజ్ చేసేప్పుడు హ‌రీష్ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని.. త‌న పాత్ర ఒరిజినాలిటీ చెడ‌కుండా పూర్తిగా ఆహార్యంలో మార్పులు చేర్పులు చాలానే చేశార‌ని తెలిపారు. అలాగే ఈ చిత్రంలో వ‌రుణ్ తేజ్ `ప్రాణం ఖ‌రీదు` రిఫ‌రెన్స్ తీసుకున్నాన‌ని తెలిపాడు. ఇలాంటి సినిమాల్ని ఆద‌రిస్తే మ‌రిన్ని ప్ర‌యోగాలు చేయ‌గ‌లుగుతాన‌ని వ‌రుణ్ ఆశాభావం వ్య‌క్తం చేశాడు. వాల్మీకి టీజ‌ర్ –  ట్రైల‌ర్ కి చ‌క్క‌ని ప్ర‌శంస‌లు ద‌క్కాయి. వ‌రుణ్ రెట్రో లుక్ మెప్పించింది. ఈ చిత్రంలో శ్రీ‌దేవి పాత్ర‌లో పూజా హెగ్డే న‌టించిన సంగ‌తి తెలిసిందే. 14 రీల్స్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించింది.