నీహారిక పెళ్లి గోల.. ఇదైనా నిజమేనా?
ఇదిగో పులి అంటే అదిగో మేక! అన్న చందంగా ఉంది. ఉన్నట్టుండి ఎలా పుట్టిందో కానీ.. మెగాబ్రదర్ నాగబాబు కుమార్తె నీహారిక పెళ్లికి వరుడు దొరికేశాడంటూ ఒక సెక్షన్ మీడియా జోరుగా పుకార్లను ప్రచారం చేస్తోంది. ఇది నిజమా? కాదా? అన్నది అటుంచితే.. ఇప్పటికే చాలా ప్రచారమే జరిగిపోయింది.
మెగా డాటర్ నికారికా వివాహం చాలాకాలంగా ట్రెండింగులో ఉంది. ఇంతకుముందు డార్లింగ్ ప్రభాస్ ని పెళ్లాడేయబోతోందంటూ ప్రచారమైంది. కానీ అది నిజం కాలేదు. ఆ తర్వాత ఒక మనసు కోస్టార్.. యంగ్ రైజింగ్ హీరో నాగశౌర్యను పెళ్లాడేస్తోందంటూ కొన్ని పుకార్లు జోరుగా షికారు చేశాయి. కానీ అదీ నిజం కానే లేదు. లేటెస్టుగా నిహారిక ఇచ్చిన హింటు పెను తుఫాన్ లా మారింది. ఇటీవల ఆమె ఒక కాఫీ కప్పుపై Ms / Mrs Niharika అన్న వ్యాఖ్యను జోడించి ఒక ఫోటోని ట్వీట్ చేసింది.
దీంతో నిహారిక ఎంగేజ్‌మెంట్ ఈవెంట్ పూర్తయిందని ప్రచారం మొదలైంది. వరుడు ప్రకాశం జిల్లా లేదా గుంటూరు, చీరాల ప్రాంతానికి చెందిన కాపు సామాజిక వర్గం కుర్రాడు అంటూ ప్రచారం సాగిపోతోంది. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ప్రైవేట్‌గా ఉంచారని.. ఫోటోల్ని కానీ.. మీడియాని కానీ పిలవనే లేదని ప్రచారం సాగుతోంది.
రానా-మిహీకా జంట రోకా ఫంక్షన్ తరహాలో నీహారిక ఏదైనా లీకులిస్తే బావుండునని అభిప్రాయం వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో తన స్నేహితుల్లో కొంతమందితో నిహారికా చేసిన వ్యాఖ్యల ప్రకారం మేము రెండు రోజుల్లో ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని కాపు కాసుకుని కూచున్నారు మరి. ఒక అబ్బాయితో ఆమె ముఖచిత్రం ఫేస్ బుక్ లోనూ కనిపిస్తోంది. దాని క్రింద `అభినందనలు` సందేశాలు చూస్తుంటే ఏదో జరుగుతోందన్న సందేహం కలుగుతోంది. మరి వీటన్నిటినీ బలపరుస్తూ ఏదైనా ఫోటో ఆధారాన్ని నీహారిక అందిస్తారా? అన్నది చూడాలి.