Niharika: నిహారిక కొణిదెలా పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో హీరోయిన్ గాను నిర్మాతగాను ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంటూ బిజీగా గడుపుతున్నారు. ఇలా నిర్మాతగా ప్రస్తుతం సినిమా పనులలో బిజీగా ఉన్న నిహారిక తనకు ఏమాత్రం విరామం దొరికిన వెంటనే తన స్నేహితులతో కలిసి వెకేషన్ లకి వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉండే ఈమె నిత్యం తనకు సంబంధించిన ఫోటోలు వీడియోలను అభిమానులతో పంచుకుంటారు. అయితే తాజాగా నిహారిక ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు..
ఇక ఈ వీడియోకి సారీ అమ్మ అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎత్తైన జలపాతం వద్ద పెద్ద ఎత్తున నీటి ప్రవాహం ఉండటమే కాకుండా విపరీతమైన గాలితో భయంకరమైన వాతావరణం ఏర్పడింది అలాంటి పరిస్థితులలో నిహారిక అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్న వీడియోని షేర్ చేయడంతో ఇది కాస్త సంచలనగా మారింది. ఇక ఈ వీడియోని షేర్ చేసిన ఈమె నేను ఏదైనా ట్రిప్ వెళితే అమ్మ నేను క్షేమంగా రావాలని ప్రార్థిస్తూ ఉంటుంది. ఇకపోతే నేనేమో ఇలా ఎంజాయ్ చేస్తుంటాను అంటూ ఈ వీడియోని షేర్ చేశారు.
ప్రస్తుతం నిహారిక షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతుంది అయితే ఇందులో భాగంగా నిహారిక ఎంతో ఎంజాయ్ చేస్తున్నప్పటికి ఈ వీడియో చూసిన అభిమానులు మాత్రం జాగ్రత్తగా ఉండండి అంటూ కామెంట్లు చేస్తున్నారు అలాగే మీరు క్షేమంగా రావాలని మేము కూడా కోరుకుంటున్నాము అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక నిర్మాతగా నిహారిక కమిటీ కుర్రోళ్ళు సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు ఇక ప్రస్తుతం సంతోష్ శోభన్ హీరోగా తన తదుపరి సినిమా షూటింగ్ పనులను కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే.
