మెగా కోడ‌లు ఉపాస‌న ఇలా షాకిచ్చారేమిటి?

మెగా కోడలు ఉపాసన కొణిదెల లైఫ్ స్టైల్ గురించి తెలిసిందే. అపోలో లైఫ్-అపోలో ఫౌండేష‌న్ అధినేతగా అభిమానుల‌కు ఉపాస‌న సూచ‌న‌లు స‌ల‌హాల గురించి విధిత‌మే. సామాజిక‌ మాధ్య‌మాల్లో ఇప్ప‌టికే ల‌క్ష‌ల్లో అభిమానులు త‌న‌ని అనుస‌రిస్తుండ‌డం ఆస‌క్తికరం. ఉపాస‌న‌ హెల్త్ ఫిట్ నెస్ సంబంధిత స‌ల‌హాల‌కు గొప్ప ఫాలోయింగ్ ఉంది.అలాగే హైద‌రాబాద్ లో ఉన్న బెస్ట్ మ‌హిళా వ్యాపార వాణిజ్య వేత్త‌గానూ ఉపాస‌న గౌర‌వం అందుకుంటున్నారు. ఒక ఆద‌ర్శ‌ మ‌హిళ‌గా విలువ‌ల‌తో కూడుకున్న ఆరోగ్య‌వంత‌మైన స‌మాజ స్థాప‌న‌కై త‌న ప్ర‌య‌త్నం యువ‌త‌రంలో ప్ర‌తిసారీ స్ఫూర్తిని నింపుతోంది. బిల్ గేట్స్ వంటి ప్ర‌ముఖుల‌తో క‌లిసి ఇండియ‌న్ ఫిలాంథ్ర‌పి ఇనిషియేటివ్ (ఐపీఐ) ద్వారా మ‌రిన్ని అవేర్ నెస్ కార్య‌క్ర‌మాల‌తో ఆక‌ట్టుకుంటున్నారు. ప‌లు పారిశ్రామ‌క స‌మ్మిట్ ల‌లో అద్భుత స్పీచ్ ల‌తోనూ ఉపాస‌న మెప్పించారు.. స్ఫూర్తిని నింపారు.

తాజాగా ఉపాస‌న ఓ థ్రోబ్యాక్ ఫోటోని అభిమానుల‌కు సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేశారు. “ఈ పోస్ట్ మీలో స్ఫూర్తి నింపుతుంది. గుడ్ టైమ్ కోసం వేచి చూడాలి. ప్ర‌స్తుత స‌న్నివేశంలో ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌శాంత చిత్తాన్ని క‌లిగి ఉండాలి. భవిష్య‌త్ కోసం పాజిటివ్ గా వేచి చూడాలి“ అంటూ చ‌క్క‌ని సందేశాన్ని ఇచ్చారు. క‌‌రోనా క‌ల్లోలం నేప‌థ్యంలో ఇలాంటి పాజిటివ్ సూచ‌న‌లు చేయ‌డం సామాన్యుల్లో ధైర్యాన్ని నింప‌డం ఆహ్వానించ‌ద‌గిన‌దే. హ్యాట్సాఫ్ టు మెగా కోడ‌లు ఉపాస‌న‌.