వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా రూపొందిన ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ జనవరి 25న విడుదల కానుంది.
బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చారిత్రక చిత్రం తెలుగు వెర్షన్ సైతం అదే రోజు రిలీజ్ అవుతోంది. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన ఝాన్సీ లక్ష్మీ బాయ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా విశేషాల కన్నా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో వినిపించింది.
బ్రిటీష్ వారితో యుద్దం చేయడానికి ఝాన్సీ లక్ష్మీబాయి ఎంత కష్టపడిందో.. ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి కంగనా రనౌత్ కూడా అంతే కష్టపడిందని బాలీవుడ్ అభివర్ణిస్తోంది. మణికర్ణిక తెలుగు ట్రైలర్‌ను ఇటీవలె విడుదల చేసింది చిత్రంటీమ్.
ఆసక్తిగా సాగుతున్న ఈ ట్రైలర్‌లో దేశభక్తిని రేకెత్తించేలా ప్రతీ సన్నివేశాన్ని షూట్ చేసారు. మనం పోరాడుదాం..మన భావితరాలు స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటాయి.. మీ పోరాటం రేపటి గురించి నేటి కోసం కాదు వంటి డైలాగులు కూడా అంతే పదునుతో ఉన్నాయి. ఇక ఈ ట్రైలర్‌లో కంగనా విజృంభించిందనే చెప్పాలి. ముఖ్యంగా యుద్ద సన్నివేశాల్లో కూడా కంగనా తనేంటని చూపించింది. ఈ చిత్రానికి క్రిష్, కంగనా రనౌత్‌లు దర్శకత్వం వహించారు.