మన తెలుగువాడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన బాలీవుడ్ మూవీ `మణికర్ణిక`. ఝాన్షీ లక్ష్మీబాయి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ ఇందులో టైటిల్ రోల్‌ను పోషించారు. వీరనారిగా చెలరేగిపోయారు. కంగన.. లక్ష్మీబాయిగా రౌద్రరసాన్ని పలికించారు. ఈ విషయం ట్రైలర్‌లోనే క్లియర్‌గా అర్థమైపోతోంది. ఈ సినిమా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఆకట్టుకుంది. ఈ సినిమా చూడాలని నిర్ణయించుకున్నారు.
దీనికోసం శుక్రవారం రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నారు. రామ్‌నాథ్ కోవింద్, కంగన రనౌత్‌తో పాటు సినిమా యూనిట్ మొత్తం ఈ సినిమాను రాష్ట్రపతితో కలిసి చూడబోతున్నారు. సుమారు 80 శాతం సినిమాను షూట్ చేసిన తరువాత మణికర్ణిక ప్రాజెక్ట్ నుంచి క్రిష్ తప్పుకొన్నారు. మిగిలిన సినిమాను కంగన తానే సొంతంగా దర్శకత్వం వహించారు. ఈ నెల 25న ఈ మూవీ విడుదల కాబోతోంది.
Shri Ram Nath Kovind, President of India, will watch a special screening of #Manikarnika: The Queen Of Jhansi in New Delhi tomorrow [18 Jan]… Kangana Ranaut and the team will be present… Screening organised by Zee Entertainment… #Manikarnika releases on 25 Jan 2019. pic.twitter.com/axuA0waqhb
— taran adarsh (@taran_adarsh) January 17, 2019