పూరి `ఫైట‌ర్` నుంచి మ‌ణిశ‌ర్మ ఔట్?

Mani Sharma

రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో `ఫైట‌ర్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. పూరి- బాలీవుడ్ నిర్మాత క‌ర‌ణ్ జోహార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ భాష‌ల్లో రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా కేట‌గిరిలోనూ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేప‌థ్యంలో సినిమాపై భారీ అంచ‌నాలే ఏర్ప‌డుతున్నాయి. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కార‌ణంగా షూటింగ్ ఆపేసారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. ఈ సినిమా నుంచి సంగీత ద‌ర్శ‌కుడు మ‌ణిశ‌ర్మ త‌ప్పుకున్న‌ట్లు స‌మాచారం.

క‌ర‌ణ్ జోహార్ -మ‌ణిశ‌ర్మ మ‌ధ్య త‌లెత్తిన మ్యూజిక్ క్రియ‌టివ్ డిఫ‌రెన్స్ కార‌ణంగానే ఆయ‌న త‌ప్పుకోవాల్సి వ‌చ్చింద‌ని లీకులందుతున్నాయి. లాక్ డౌన్ స‌మ‌యంలో మ‌ణిశ‌ర్మ సిద్దం చేసిన ట్యూన్స్ క‌ర‌ణ్ కి వినిపించారుట‌. కానీ ఆయ‌న కొన్నింటిలో అభ్యంత‌రం వ్య‌క్తం చేసారుట‌. ఇంకా బెట‌ర్ మెంట్ కోరారుట‌. చేసిన‌ప్ప‌టికీ క‌ర‌ణ్ సంతృప్తి చెంద‌క‌పోవ‌డంతో త‌ప్పుకున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ట్యూన్స్ ముందే పూరి ఫైన‌ల్ చేసిన‌వి అట‌. అయినా క‌ర‌ణ్ పూరి సిఫార్స్ ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేద‌ని స‌మాచారం. మ‌రి ఇందులో నిజా నిజాలు తేలాల్సి ఉంది. ఇప్ప‌టికే పూరి స్ర్కిప్ట్ లో నూ క‌ర‌ణ్ వేలు పెట్టాడ‌ని ప్ర‌చారం సాగింది.

పూరి-మ‌ణిశ‌ర్మ కాంబినేష‌న్ అంటే ఆ సినిమా మ్యూజిక‌ల్ గా హిట్ అని చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టివ‌ర‌కూ ఆ క‌ల‌యికలో తెర‌కెక్కిన సినిమాలు మ్యూజిక‌ల్ గా సంచ‌ల‌నం సృష్టించాయి. ట్యూన్స్ కంపోజ్ చేసే ముందు పూరి త‌ను చెప్పాల‌నుకున్నది శ‌ర్మ‌కి క్లియ‌ర్ గా చెప్పేస్తాడు. అందులో ఎలాంటి డౌట్లు ఉండ‌వు. పూరి విజ‌న్ ని మ‌ణిశ‌ర్మ ఇట్టే ప‌ట్టేస్తారు. అందుకే ఆ కాంబినేష‌న్ ఇప్ప‌టివ‌ర‌కూ ఫెయిల్ అవ్వ‌లేదు. అయితే క‌ర‌ణ్ ఎంట్రీతో సీన్ కాస్త క‌న్ఫ్యూజ‌న్ అయిన‌ట్లే క‌నిపిస్తోంది.