నందమూరి అభిమానుల మనసు దోచుకున్న మంచు మనోజ్

రోడ్ ప్రమాదంలో మందమూరి హరికృష్ణ ఆకస్మికంగా మరణించడం తెలుగు వారినందరిని షాక్ కు గురిచేసింది. చైతన్య రథ సారథిగా తెలుగు వారి హృదయాల్లో శాశ్వతంగా స్థానం సంపాదించిన హరికృష్ణ అంత్యక్రియలు నిన్న జూబ్లీ హిల్స్ మహా ప్రస్థానంలో జరిగాయి.

ఈ సమయంలో చాలామంది ఆప్తులు నందమూరి అన్నదమ్ములకు అండగా నిలబడ్డారు. ఎన్టీఆర్ కు మంచు మనోజ్ చాలా క్లోజ్ ఫ్రెండ్ అనే విషయం తెలిసిందే. అంతే కాదు నందమూరి కుటుంబంతో మంచు ఫ్యామిలీ వారి స్నేహం ఈ నాటిది కాదు. నిన్న ఎన్టీఆర్ కు మంచు మనోజ్ బాసటగా నిలిచాడు. అంతిమ యాత్ర సమయంలోనూ , అంత్యక్రియల సమయంలో ఫ్యాన్స్ తాకిడి ఎక్కువగా ఉండడంతో వారు ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ మీదకు రాకుండా కంట్రోల్ చేస్తూ అన్నదమ్ములకు  ఇబ్బంది లేకుండా చూడడం అందరి ద్రుష్టిని ఆకర్శించింది.

నందమూరి అభిమానులకు మనోజ్ మంచి మనసుకు ఫిదా అయ్యి ప్రశంసిస్తున్నారు. ట్విట్టర్ లో ఎన్టీఆర్ , మనోజ్ కలిసి ఉన్న ఫొటోలో పోస్ట్ చేసి క్లిష్ట సమయంలో తోడుగా నిలిచినందుకు థ్యాంక్స్ చెబుతూ తమ ప్రేమను చాటుకున్నారు.

 అంతే కాదు నందమూరి హరికృష్ణ కొద్దీ రోజుల క్రితం ఒక లెటర్ రాశారు. అందులో తన పుట్టిన రోజు వేడుకలు చెయ్యవద్దని కోరారు. కేరళలో వరదలు , ఏపీ లో కొన్ని జిల్లాలు  వరదల కారణంగా చాలామంది  ప్రజలకు నష్టం జరిగింది వారికీ ఆ డబ్బులు విరాళంగా ఇవ్వమని కోరారు. ఈ లెటర్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన మనోజ్ తాను 5 లక్షలు హరికృష్ణ అంకుల్ జ్ఞాపకార్థం విరాళంగా ఇస్తున్నానని. నందమూరి అభిమానులు తెలుగు సినిమా ప్రేక్షకులను విరాళాలు ఇవ్వాల్సిందిగా  పిలుపునిచ్చాడు.