ఎన్టీఆర్, మంచు మనోజ్ ల మధ్య చిన్నప్పటి నుంచి మంచి స్నేహం ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయం అప్పుడప్పుడూ మంచు మనోజ్ తన సోషల్ మీడియా ఎక్కౌంట్ లో ప్రస్తావిస్తూ ఉంటారు. రీసెంట్ గా నందమూరి హరికృష్ణ మరణం సమయంలో కల్యాణ్ రామ్ – ఎన్టీఆర్ లకు మనోజ్ బౌన్సర్ లా వ్యవహరించి అందరి మన్ననలు పొందాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ కోసం చిన్నతనంలో మనోజ్ చేసిన సాహసం గురించి ఓ ఫ్యాన్ మనోజ్
ను అడిగాడు. దానికి మనోజ్ ..ఇచ్చిన ఆన్సర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
వివతరాల్లోకి వెళితే ..చిన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని ఎవరో ఒకతను కొట్టారట. దానికి మనోజ్ వెళ్లి.. ఎన్టీఆర్ పై చెయ్యి ఎత్తిన వాడి చెయ్యి విరగ్గొట్టాడట. చిన్నప్పుడు జరిగిన ఈ సంఘటన గురించి చెప్పమని ఓ అభిమాని మనోజ్ ని కోరాడు.
Anna Jr NTR Anna ki chinnappudu yevaro kodithe meeru vaadi hand virakkottaranta …. Please tell about that story……. I strongly request you* pic.twitter.com/5D5MIXJJGb
— SATEESH PATHIVADA 6666 (@SATEESHPATHIVA3) September 26, 2018
దాంతో మనోజ్ ఆ అభిమానికి సమాధానంగా నవ్వుతూ.. ‘తారక్‌నే అడుగు. ఈ విషయం గురించి నాకంటే తనే బాగా చెప్తాడు’ అని పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.