Home Tollywood మ‌హేష్‌-శ‌ర్వానంద్ కాంబినేష‌న్ లో!

మ‌హేష్‌-శ‌ర్వానంద్ కాంబినేష‌న్ లో!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు-యంగ్ హీరో శ‌ర్వానంద్ కాంబినేష‌న్ లో ఓ సినిమాకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయా? అంటే అవున‌నే తెలుస్తోంది. ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ ఫుల్ స్వింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ స‌క్సెస్ లు అందుకుంటూ కెరీర్ గ్రాఫ్ ను అంత‌కంత‌కు పెంచుకుంటూ పోతున్నాడు. స్ర్కిప్ట్ న‌చ్చితే మ‌ల్టీస్టార‌ర్ సినిమాల‌కు వెన‌క‌డుగు వేడ‌యం లేదు. ఈ నేప‌థ్యంలో మ‌రోసారిస్టార్ తో క‌లిసి సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నారు. అయితే ఇది మ‌ల్టీస్టార‌ర్ కాదు. మ‌హేష్ నిర్మాత‌గా శ‌ర్వానంద్ హీరోగా సినిమా చేయ‌డానికి మ‌హేష్ ఒప్పందం చేసుకున్న‌ట్లు స‌మాచారం. మ‌హేష్ జీఎంబీ ప్రొడ‌క్ష‌న్స్ మొద‌లు పెట్టి అందులో సినిమాలు నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

త‌న పారితోషికాన్ని పెట్టుబ‌డిగా పెట్టి ఇత‌ర బ్యాన‌ర్లో న‌టించి లాభాలు అర్జిస్తున్నాడు. అయితే ఇప్పుడు నేరుగా అదే బ్యాన‌ర్ పై బ‌య‌ట హీరోల‌తో సినిమాలు చేస్తున్నాడు. ఇప్ప‌టికే అడ‌వి శేషు హీరోగా మేజ‌ర్ అనే సినిమా నిర్మిస్తున్నాడు. ఇది డిఫ‌రెంట్ జాన‌ర్ సినిమా. ఈ నేప‌థ్యంలోనే శర్వానంద్ తోనూ సినిమా నిర్మించ‌డానికి ఒప్పందం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా కు ద‌ర్శ‌కుడు ఎవ‌రు? స్ర్కిప్ట్ ఎలాంటిది అన్న వివ‌రాలు మాత్రం ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. ప్ర‌స్తుతం మ‌హేష్ ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట చిత్రంలో న‌టించ‌డానికి రెడీ అవుతున్నారు. ఇప్ప‌టికే ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా పూర్త‌య్యాయి.

షూటింగ్ ల‌కు ప్ర‌భుత్వం అనుమ‌తి కూడా ఇచ్చింది. కానీ క‌రోనా వైర‌స్ అస‌లు ఉగ్ర‌రూపం దాల్చ‌డంతో షూటింగ్ లు చేయాలంటే సెలబ్రిటీలంతా భ‌య‌ప‌డుతున్నారు. ఇప్ప‌టికే అలాంటి ప్ర‌య‌త్నాన్ని టీవీ ఆర్టిస్టులు చేసి అడ్డంగా బుక్క‌య్యారు. ప‌లువురు న‌టులు టీవీ సీరియ‌ల్ షూటింగ్ లో పాల్గొన‌డంతో క‌రోనా క‌ల‌క‌లం రేగింది. దీంతో త‌క్ష‌ణం షూటింగ్ లు నిలిపివేసారు. తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో షూటింగ్ లు ఇప్ప‌ట్లో జ‌రిగే స‌న్నివేశం క‌నిపించ‌లేదు. రిలీజ్ కు సిద్దంగా ఉన్న సినిమాల‌ను ఓటీటీల్లో రిలీజ్ చేస్తున్నారు. క‌ష్ట‌మో..న‌ష్ట‌మో భ‌రించి ఓటీటీల్నే ఆప్ష‌న్ గా ఎంచుకుని ముందుకెళ్తున్నారు.

Related Posts

తప్పదిక.. పెద్ద సినిమాలు తాడో పేడో తేల్చుకోవాల్సిందే.!

'లవ్ స్టోరీ' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంచి టాక్ సంపాదించుకుంది. కష్టకాలంలో తెలుగు సినిమాకి ఊరటనిచ్చింది 'లవ్ స్టోరీ' రిలీజ్. వాస్తవానికి 'సీటీమార్' ద్వారా ఈ వేవ్ రావల్సి ఉంది. 'సిటీమార్' తరహాలో...

నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ ఊపు తెచ్చిందిగానీ.!

అహహా.. ఎన్నాళ్ళ తర్వాత ఈ సందడి.? అడ్వాన్స్ బుకింగుల జోరు చూసి ఎన్నాళ్ళయ్యింది.? సినీ పరిశ్రమలో జరుగుతున్న చర్చ ఇది. ఔను, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా రూపొందిన 'లవ్...

మేమే గెలుస్తాం: మంచు విష్ణు ధీమా అదిరింది..

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'మా' ఎన్నికల్లో ఇంతకు ముందెప్పుడూ లేనంత గందరగోళం ఈసారి నెలకొన్న మాట వాస్తవం. దానికి కారణమెవరు.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ప్రకాష్ రాజ్ ద్వారా హంగామా మొదలైంది.. అక్కడినుంచే...

Related Posts

Latest News