Home Tollywood మ‌హేష్-ఎన్టీఆర్ మ‌ల్టీస్టార‌ర్.. అల్లు బాస్ మ‌ళ్లీ..

మ‌హేష్-ఎన్టీఆర్ మ‌ల్టీస్టార‌ర్.. అల్లు బాస్ మ‌ళ్లీ..

                                   ఇదే నిజ‌మైతే ఫ్యాన్స్ కి పెద్ద పండ‌గే

సూప‌ర్ స్టార్ మ‌హేష్ .. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో భారీ మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్క‌నుందా? అంటే అవున‌నే స‌మాచారం. అందుకు గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అర‌వింద్ స‌న్నాహ‌కాల్లో ఉన్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే మ‌హేష్.. తార‌క్ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వచ్చేసింది. ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌ల‌తో స్క్రిప్టుల్ని వండే ప‌నిలో ఉన్నార‌ని కూడా తాజాగా స‌మాచారం లీకైంది.

వాస్త‌వానికి ఈ కాంబినేషన్ సినిమాకి ప్ర‌య‌త్నించ‌డం ఇదే తొలిసారి కాదు. అల్లు అర‌వింద్ చాలా కాలంగా ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఆ ఇద్ద‌రి కాల్షీట్ల స‌ర్ధుబాటు అన్న‌ది చిక్కులు తెచ్చి పెట్టింది. అప్ప‌ట్లో బ‌న్నీనే స్వ‌యంగా మ‌హేష్‌- తార‌క్ సినిమాని నిర్మించేందుకు ముందుకు వ‌చ్చారు. కానీ కుద‌ర‌లేదు. ఈసారి బ‌న్నీకి ఏ సంబంధం లేదు కానీ అర‌వింద్ మాత్రం క‌థంతా ముందుండి న‌డిపిస్తార‌ట‌.

ఒక‌వేళ ఇదే నిజ‌మైతే మ‌హేష్.. తార‌క్ ఫ్యాన్స్ కి పండ‌గే. ఇది అరుదైన క‌ల‌యిక‌. ఎగ్జ‌యిట్ మెంట్ పెంచే కంటెంట్ తో ఈ మూవీ ఉంటుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్ప‌టికే ఈ ఇద్ద‌రూ సౌతిండియా స్టార్లుగా అసాధార‌ణ స్టార్ డ‌మ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. హిందీలో మార్కెట్ పెంచుకునే ఎత్తుగ‌డ‌ల‌తో ముందుకు సాగుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో అర‌వింద్ ఆ ఇద్ద‌రినీ క‌లిపే ప్ర‌య‌త్నం చేయడం ఉత్కంఠ పెంచుతోంది. 

Related Posts

తప్పదిక.. పెద్ద సినిమాలు తాడో పేడో తేల్చుకోవాల్సిందే.!

'లవ్ స్టోరీ' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంచి టాక్ సంపాదించుకుంది. కష్టకాలంలో తెలుగు సినిమాకి ఊరటనిచ్చింది 'లవ్ స్టోరీ' రిలీజ్. వాస్తవానికి 'సీటీమార్' ద్వారా ఈ వేవ్ రావల్సి ఉంది. 'సిటీమార్' తరహాలో...

నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ ఊపు తెచ్చిందిగానీ.!

అహహా.. ఎన్నాళ్ళ తర్వాత ఈ సందడి.? అడ్వాన్స్ బుకింగుల జోరు చూసి ఎన్నాళ్ళయ్యింది.? సినీ పరిశ్రమలో జరుగుతున్న చర్చ ఇది. ఔను, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా రూపొందిన 'లవ్...

మేమే గెలుస్తాం: మంచు విష్ణు ధీమా అదిరింది..

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'మా' ఎన్నికల్లో ఇంతకు ముందెప్పుడూ లేనంత గందరగోళం ఈసారి నెలకొన్న మాట వాస్తవం. దానికి కారణమెవరు.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ప్రకాష్ రాజ్ ద్వారా హంగామా మొదలైంది.. అక్కడినుంచే...

Related Posts

Latest News