ఓ బేబీ బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న సమంత అక్కినేనికి, ఆ చిత్ర దర్శకురాలు నందిని రెడ్డిలకు హైకోర్ట్ షాకిచ్చింది. జబర్‌దస్త్ సినిమాకు సంబంధించి. 2013లో జబర్‌దస్త్ అనే సినిమా విడుదలైంది. ఇందులో సిద్ధార్థ్, సమంత హీరో హీరోయిన్‌గా నటించారు. నందిని రెడ్డి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. సినిమా విడుదలైన తర్వాత తమ బ్యానర్‌లో 2010లో రణ్‌వీర్ సింగ్, అనుష్క శర్మ జోడిగా నటించిన బ్యాండ్ బాజా బరాత్ సినిమాను తెలుగులో ఎలాంటి రైట్స్ కొనుగోలు చేయకుండా జబర్‌దస్త్ పేరుతో తెరకెక్కించారని బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ కోర్టులో కేసు వేసింది. ఆరేళ్ల తర్వాత కోర్టు నిర్మాణ సంస్థకు అనుకూలంగా తీర్పునిచ్చింది. జబర్‌దస్త్ మూవీకి సంబంధించి ఎలాంటి ప్రదర్శన చేయరాదంటూ ఆదేశాలు జారీ చేసింది.
సమంత-నందిని రెడ్డిలకు హైకోర్ట్ షాక్
