సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించనున్న 27వ చిత్రానికి పరశురాం దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్ర్కిప్ట్ సహా అన్ని పనులు పూర్తిచేసి సెట్స్ కు వెళ్లడానికి రెడీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో హటాత్తున మహామ్మారి కరోనా దేశాన్ని చుట్టేయడంతో సన్నివేశమే తారుమారైంది. పరిస్థితులను వైరస్ కు అనుకూలంగా మార్చేసుకుని సినిమా రంగాన్నే చుట్టేస్తోంది. తాజాగా ఆ ప్రభావం మహేష్ సినిమాపై స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో కీలక సన్నివేశాలు.. స్ర్కిప్ట్ నేపథ్యం ఎక్కువ భాగం అమెరికాలోనే సాగుతుందిట. దీంతో దాదాపు 70 శాతం షూటింగ్ అక్కడే చేయాల్సి ఉందిట.
కానీ కోవిడ్ -19 కారణంగా ఆ దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో తెలిసిందే. ప్రపంచం మొత్తంలో ఎక్కువగా అమెరికాలోనే వైరస్ మరణాలు నమోదయ్యాయి. శవాల్ని సైతం పూడ్చడానికి స్థలం లేక పబ్లిక్ పార్కుల్లోనే బాడీలను పూడ్చారు. దీంతో వైరస్ ఎప్పుడైనా మళ్లీ పురుడు పొసుకునే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే కోలుకున్న వారిపైనే వైరస్ మళ్లీ తిరగబెడుతుందని సర్వేలు చెబుతున్నాయి. వ్యాక్సిన్ కూడా అందుబాటు లేదు కాబట్టి..మహమ్మారి కి మందు వచ్చే వరకూ మానవాళి మనుగడకైతే ముప్పు తప్పదు. ఈ నేపథ్యంలో పరుశురాం స్ర్కిప్ట్ లోనే మార్పులు చేస్తున్నట్లు సమాచారం.
అమెరికా నేపథ్యాన్ని పూర్తిగా మార్చేసి ఓ కొత్త బ్యాక్ డ్రాప్ తీసుకుని స్ర్కిప్ట్ లో మార్పులు చేస్తున్నాడుట. అంటే పరశురాం ఇప్పుడు కరోనా వైరస్ లేని దేశాన్ని నేపథ్యంగా తీసుకోవాల్సి ఉందన్న మాట. కరోనా రహిత దేశాలు గా ఇప్పటికే కొన్ని ఉన్నాయి. ప్రస్తుతం కరోనా సోకిన దేశాలతో పోల్చుకుంటే భారత్ ఉత్తమ దేశంగానే ఉంది. ఇక్కడ మరణాలు…బాధితుల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. కాబట్టి పరశురాం ఆప్షన్ లో భారత్ ఉంటుందా? లేదా? అన్నది చూడాలి. స్ర్కిప్ట్ విదేశీ నేపథ్యంతో కూడిన ది కాబ్టటి సెట్స్ వేసిన ఆ వాతావరణాన్ని తీసుకురావడం అసాధ్యం. మరి పరుశురాం-మహేష్ ఎలాంటి ఐడియాతో ముందుకెళ్తారో చూడాలి.
