‘మహర్షి’ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటైల్స్

‘భరత్ అనే నేను’వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత సక్సెస్‌ఫుల్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న చిత్రం ‘మహర్షి’. ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగా ప్రీ రిలీజ్ బిజినెస్ సైతం జరిగిందని సమాచారం. విడుదలకు ముందే ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ ఉండటంతో దాన్ని బాగానే క్యాష్ చేసుకుంటూ ‘మహర్షి’ బిజినెస్‌ ని పూర్తి చేసారు నిర్మాతలు.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం బిజినెస్ 150 కోట్ల వరకు జరిగింది . పెట్టిన పెట్టుబడి మొత్తం బిజినెస్ రూపంలో వెనక్కి వచ్చింది అయితే లాభాలు రాలేదంటున్నారు. కొన్న బయ్యర్లకు లాభాలు రావాలంటే దాదాపు 120 కోట్ల షేర్ దాటి రావాలి. అప్పుడే బయ్యర్లకు , నిర్మాతలకు ఏమైనా లాభాలు వస్తాయి . మహేష్ సరసన పూజా హెగ్డే నటించిన మహర్షి చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ ఏరియాల వారీగా …

నైజాం – 24 కోట్లు

సీడెడ్ – 12. 60 కోట్లు

కృష్ణా – 6 కోట్లు

గుంటూరు – 7. 70 కోట్లు

ఈస్ట్ – 7. 20 కోట్లు

వెస్ట్ – 6 కోట్లు

నెల్లూరు – 2. 90 కోట్లు

ఉత్తరాంధ్ర – 9. 60 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా – 1. 70 కోట్లు

ఓవర్ సీస్ – 14 కోట్లు

కర్ణాటక – 8. 30 కోట్లు

ఏరియాల వారీగా మొత్తం – 100 కోట్లు

శాటిలైట్ – 16. 50 కోట్లు

డిజిటల్ రైట్స్ – 11 కోట్లు

హిందీ డబ్బింగ్ రైట్స్ – 20 కోట్లు

మ్యూజిక్ – 2. 50 కోట్లు

అన్నీ కలిపి – 150 కోట్లు

ఈ చిత్రంలో మహేష్ మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో నటించనున్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన 5 మందిలో ఒకడిగా మ‌హేష్‌ నటిస్తున్నట్లు తెలుస్తోంది. కార్పోరేట్ అధిపతిగా యూఎస్ నుండి తిరిగివచ్చి వ్యవసాయంలో రైతులకు సరికొత్త విధానాన్ని అందించే పాత్రలో కనిపించబోతున్నారట మహేష్.

దిల్ రాజు, అశ్వినీదత్ , పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.చిత్రంలో మ‌హేష్ స్నేహితుడిగా అల్ల‌రి న‌రేష్ న‌టిస్తున్నారు. ఈ చిత్రం రిలీజ్ త‌ర్వాత మ‌హేష్ త‌న 26వ చిత్రంగా అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు.