‘మహర్షి’ 50 డేస్ ఫంక్షన్ కాన్సిల్

ప్రముఖ నటి విజయ నిర్మల మృతి చెందటంతో ‘మహర్షి’ సినిమా విజయోత్సవ వేడుకను వాయిదా వేశారు. ఈ విషయాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థ ట్విటర్‌ వేదికగా ప్రకటించింది.

జూన్‌ 28న 50 రోజుల విజయోత్సవ వేడుకను మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించాల్సి ఉంది. ఈక్రమంలో.. విజయ నిర్మల బుధవారం అర్థరాత్రి గుండెపోటుతో మరణించడంతో వేడుకను వాయిదా వేశారు. అయితే వేడుకను ఎప్పుడు నిర్వహించనున్నారనే విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు.

విజయనిర్మల పార్థివదేహాన్ని ఇవాళ ఇంట్లోనే ఉంచి రేపు ఫిల్మ్‌ఛాంబర్‌కు తరలిస్తారు. విజయనిర్మల భౌతికకాయానికి రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.