స్టార్ హీరో సినిమానే..కానీ డబ్బులు ఎగ్గొట్టారు

టెక్నీషియన్స్ కు ఇవ్వాల్సిన రెమ్యునేషన్స్ లను ఎగ్గొట్టండంలో సినిమా పరిశ్రమ పిహెచ్ డి చేసింది. అయితే పరిశ్రమలో సర్వైవ్ అయ్యేవారు..సర్లే …మళ్లీ ఇక్కడే జీవితం గడపాలి, ఆఫర్స్ అందిపుచ్చుకోవాలి..అని అల్లరి చేయటానికి ఇష్టపడరు. దాంతో నిర్మాతలు సేవ్ అయ్యిపోతూంటారు. కానీ ప్రతీసారి అలా జరగదు. రమణ్ శర్మ లాంటి వాళ్లు ఉంటారు. తమిళ సూపర్ స్టార్ విజయ్ సినిమా కు సంభందించిన రెమ్యునేషన్ ఎగ్గొట్టారని ఆయన మీడియాకు ఎక్కారు.

వివరాల్లోకి వెళితే… తమిళంలో ఘన విజయం సాధించిన ‘మెర్సల్‌’(తెలుగులో అదిరింది) నిర్మాతలు ఇప్పటి వరకూ తనకు ఇవ్వాల్సిన రెమ్యునేషన్ చెల్లించలేదని ప్రముఖ మెజీషియన్‌ రమణ్‌ శర్మ ఆరోపిస్తూ వార్తల్లో కు ఎక్కారు. అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని తెనాండల్‌ స్టూడియోస్‌ సంస్థ నిర్మించింది. ఈ సినిమాలో విజయ్‌ మూడు పాత్రల్లో కనిపించారు.

పేదలకు ఉచిత వైద్యం అందించాలనే నేపథ్యంలో సాగే కథ ఇది. 2017 అక్టోబరు 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా రికార్డు సృష్టించింది. సినిమా బాక్సాఫీసు వద్ద రూ.200 కోట్లు వసూలు చేసినట్లు విశ్లేషకులు అంచనా వేశారు.ఇ క ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో విజయ్‌ మెజీషియన్‌గా కనిపిస్తారు.

వేదికపై మేజిక్‌ చేస్తున్నట్లు నటించి ఓ వ్యక్తిని హత్య చేస్తారు. అయితే ఈ సీన్ కోసం తను అట్లీకి చాలా సహాయం చేశానని రమణ్‌ శర్మ తాజాగా వరుస ట్వీట్లు చేశారు. ఇంతవరకు తనకు రెమ్యునేషన్ ఇవ్వలేదని ఆరోపించారు. ఇవిగో ఆధారాలంటూ నిర్మాణ సంస్థకు చెందిన మురళీతో ఛాటింగ్‌ చేసిన మెసేజ్ లు చూపించారు. మరి నిర్మాతలు ఏమి స్పందిస్తారో చూడాలి.