హీరో శింబుకు షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు

తమిళ సినీ హీరో శింబుపై మద్రాస్ హైకోర్టు సీరియస్ అయింది. నిర్మాత నుంచి తీసుకున్న అడ్వాన్స్ ను వడ్డీతో సహా చెల్లించాలంటూ ఆదేశించింది. డబ్బు చెల్లించక పోతే ఆస్తులను జప్తు చేయాల్సి వస్తుందని హెచ్చరించింది. కేసు వివరాల్లోకి వెళ్తే , ‘ఆరాసన్’ చిత్రంలో నటించేందుకు గాను ప్యాషన్ మూవీ  మేకర్స్  నుంచి 2013 జూన్ 17న రూ. 50 లక్షలను శింబు అడ్వాన్స్ గా తీసుకున్నారు. అయితే  ఆ ప్రాజెక్టులో శింబు నటించ లేదు. తీసుకున్న అడ్వాన్స్ ను కూడా నిర్మాతకు తిరిగి చెల్లించలేదు. దీంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో వడ్డీతో కలిపి మొత్తం రూ. 85 లక్షలను ప్యాషన్ మూవీ మేకర్స్ కు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.