“మా “లో మాకు విభేదాలు లేవండోయ్ ..!

అని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా, కార్యదర్శి నరేష్ ఇద్దరు ఇవ్వాళ మీడియా సాక్షిగా ప్రకటించారు . మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో అమెరికాకు వెళ్లి తెస్తామన్న రెండు కోట్లు తీసుకు రాకుండా కేవలం కోటి రూపాయలు మాత్రమే తెచ్చారని , అక్కడ నిధులు గోల్ మాల్ అయ్యాయని నరేష్ శివాజీరాజా పై తీవ్ర ఆరోపణలు చేశాడు . దీనిపై శివాజీ రాజా , శ్రీకాంత్ తదితరులు అలాంటిదేమి జరగలేదని . కేవలం ఆరోపణలేనని , నిరూపిస్తే రాజీనామా చేస్తామని ప్రకటించారు . ఒకరిమీద మరొకరు బూతులతో దుమ్మెత్తి పోసుకున్నారు . ప్రేక్షకుల్లో, సినిమా పరిశ్రమలో కూడా వీరి వ్యవహారం శృతి మించిపోయిందనే అభిప్రాయం కలిగింది . ఇది మంచి పరిణామ కాదని సినిమా పెద్దలు గ్రహించి శనివారం నాడు శివాజీరాజా , నరేష్ తో ఓ సమావేశం ఏర్పాటు చేశారు .
నిర్మాతల మండలి అధ్యక్షుడు డాక్టర్ కెఎల్ నారాయణ, దగ్గుబాటి సురేష్ , తమ్మారెడ్డి భరద్వాజ వీరికి సయోధ్య కుదిర్చారు . అనుకోకుండా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో విభేదాలు చోటుచేసుకోవడం విచారకరమని , ఇది తామందరిని కలవర పరిచిందని, ఇలాంటివి సినిమా రంగంలో ముందు జరగకుండా ముఖ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు వీరు ప్రకటించారు . ఒకవేళ ఎప్పుడైనా ట్రేడ్ బాడీ లో సమస్యలు వస్తే వాటిని ఈ కమిటీ పరిష్కరిస్తుందని సురేష్ బాబు తెలిపారు . అపార్ధాలు తొలగి పోయాయని ఇక ముందు కలసి పని చేస్తామని శివాజీ రాజా, నరేష్ హాగ్ చేసుకొని ప్రకటించడం కోసం మెరుపు .