వాట్ ఈజ్ దిస్ వెంకటలక్ష్మీ?నిన్ను ఇలా చూడగలమా?

హీరోయిన్ గా కంటే ఐటెం గర్ల్‌గానే ఎక్కువ పాపులర్ అయింది రాయ్ లక్ష్మీ. ఆమె కనిపిస్తోందంటే చాలా హాట్ హాట్ ఆలోచనలు మనస్సులో మెదిలి అంచనాలు పెరుగుతాయి. అంతెందుకు ‘సర్దార్ గబ్బర్ సింగ్’లో తోబ తోబా.. ‘ఖైదీ నంబర్ 150’లో రత్తాలూ రత్తాలూ పాటలు మర్చిపోగలమా. ఆ సినిమాల్లో అవి స్పెషల్ ఎట్రాక్షన్.

అయితే అంత పెద్ద హిట్ పాటలు చేసినా తెలుగులో అంత బిజీ కాలేకపోయింది. అయితే కొంచెం గ్యాప్ తర్వాత లక్ష్మీ హీరోయిన్ గా రీఎంట్రీ ఇస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో ‘వేర్ ఈజ్ ద వెంకట లక్ష్మి’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇప్పుడీ విషయం ఎందుకు చెప్పుకుంటున్నామంటే తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. రెగ్యులర్ గా ఉండే రాయ్ లక్ష్మీ ఇమేజ్‌కు భిన్నంగా ఉందీ పోస్టర్.

రాయ్ లక్ష్మిని హాట్ గా చూపించకుండా… అందంగా.. ఆకర్షణీయంగా చూపిస్తూ ఈ పోస్టర్ డిజైన్ చేశారు. పోస్టర్ లో మరో ప్రక్క బ్లాక్ అండ్ వైట్ షేడ్‌లో కమెడియన్లు ప్రవీణ్, మధునందన్ కనిపిస్తున్నారు. కిషోర్ కుమార్ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీధర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి అనే కొత్త నిర్మాతలే ప్రొడ్యూస్ చేస్తున్నారు.

దర్శకుడు కిషోర్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘నన్ను నమ్మి నాకీ అవకాశం ఇచ్చిన లక్ష్మీ రాయ్, మరియు నిర్మాతలకు నా కృతఙ్ఞతలు. సబ్జెక్ట్ చాలా బాగొచ్చింది. కామెడీ త్రిల్లర్. ప్రేక్షకులను బాగా నవ్వించాలని చేసిన ప్రయత్నమే ఈ ‘వేర్ ఈజ్ వెంకటలక్ష్మి’ చిత్రం. ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. అందరికీ నచ్చుతుందని నమ్మకంతో ఉన్నాం’’ అన్నారు.

మరి భామను ఈ డెబ్యూ డైరెక్టర్ ఎలా చూపించాడో అనే ఆసక్తి అందరిలో మొదలైంది. మీరు ఈ పోస్టర్ చూసి ఏమన్నా అంచనాకు వచ్చారా.. రాకపోతే‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’ టీజర్ త్వరలో రిలీజ్ చేయబోతున్నారట. అప్పటిదాకా వెయిట్ చేయండి.