‘వేర్ ఈజ్ ద వెంక‌ట‌ల‌క్ష్మి’ అంటోన్న ల‌క్ష్మీరాయ్..

ర‌త్తాలు ర‌త్తాలు అంటూ తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లూగించిన బ్యూటీ ల‌క్ష్మీరాయ్ చాలా రోజుల త‌ర్వాత తెలుగు సినిమాకు సైన్ చేసింది. వేర్ ఈజ్ ద వెంక‌ట‌ల‌క్ష్మిఅంటూ ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది ల‌క్ష్మీరాయ్. పూర్తిగా విలేజ్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌బోయే ఈ చిత్రంతోనే కిషోర్ కుమార్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు.కార్తీక్, ప్రవీణ్, మధు నందన్ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. పూజిత పొన్నాడ ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టించ‌నుంది. హ‌రి గౌర వేర్ ఈజ్ ద వెంక‌ట‌ల‌క్ష్మికి సంగీతం అందిస్తున్నాడు. తాట‌వ‌ర్తి కిర‌ణ్ ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు అందిస్తున్నాడు. ద‌స‌రా సీజ‌న్ లో ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. వేర్ ఈజ్ ద వెంక‌ట‌ల‌క్ష్మి చిత్రాన్ని ఎం శ్రీ‌ధ‌ర్ రెడ్డి, హెచ్ ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి ఏబిటి క్రియేష‌న్స్ సంస్థ‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

న‌టీన‌టులు:
ల‌క్ష్మీరాయ్, పూజిత పొన్నాడ‌, కార్తీక్, ప్రవీణ్, మధు నందన్ తదితరులు 

టెక్నిక‌ల్ టీం:

ద‌ర్శ‌కుడు: కిషోర్ కుమార్ 
నిర్మాత‌లు: ఎం శ్రీ‌ధ‌ర్ రెడ్డి, హెచ్ ఆనంద్ రెడ్డి, ఆర్కె రెడ్డి
బ్యాన‌ర్: ఏబిటి క్రియేష‌న్స్
కో-డైరెక్టర్: కిషోర్ కృష్ణ 
క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు: తాట‌వ‌ర్తి కిర‌ణ్
మ్యూజిక్: హ‌రి గౌర‌
సినిమాటోగ్ర‌ఫి: వెంకట్ రమణ 
ఆర్ట్ డైరెక్ట‌ర్: బ్రహ్మ కడలి 
ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్ 
పిఆర్ఓ: వ‌ంశీశేఖ‌ర్