హాట్ ఫొటో: రత్తాలూ ఏంటీ అరాచకం?..!

ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు వేడుకగా జరుపుకుంటున్నారు. ఇక సినీ సెలబ్రెటీల ఇళ్లలో వేడుకలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. న్యూఇయర్‌ సందర్భంగా అభిమానులకు సోషల్ మీడియా ద్వారా విషెస్‌ తెలుపుతూ తమ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి దిగిన ఫొటోలను పంచుకుంటున్నారు. అయితే హీరోయిన్ లక్ష్మీ రాయ్ మాత్రం ఇంకాస్త ముందుకు వెళ్లింది. న్యూ ఇయిర్ సందర్బంగా నిన్న ఓ ఫొటో ని షేర్ చేస్తూ..ఈ సంవత్సరం ఇదే నా చివరి ఫొటో అని హాట్ ఫొటో ఒకటి షేర్ చేసింది.

ల‌క్ష్మీరాయ్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు ప్రేక్ష‌కుల‌కు చాలా బాగా ప‌రిచ‌యం ఈ ర‌త్తాలు. ఆ మ‌ధ్య మెగా బ్ర‌ద‌ర్స్‌తో చిందేసి టాలీవుడ్ హాట్‌టాపిక్‌గా మారిపోయింది ఈ భామ‌. ఆ త‌ర్వాత బాలీవుడ్‌కు వెళ్లింది. అక్క‌డ “జూలి 2″లో రెచ్చిపోయి అందాలు ఆర‌బోసింది. ఇక ఇప్పుడు మ‌రోసారి అందాల ఆర‌బోత‌తో పిచ్చెక్కించింది ల‌క్ష్మిరాయ్. ఈ ర‌త్తాలు ర‌చ్చ‌కు గూగుల్ కూడా వేడెక్కిపోతుంది. తాజాగా అమ్మ‌డు జిమ్ చేస్తూ ఫుల్లుగా ఎక్స్ పోజింగ్ చేసింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి సెగ‌లు పుట్టిస్తుంది.

ఇక లక్ష్మీరాయ్ .. ర‌త్తాలు ర‌త్తాలు ఓసోసి ర‌త్తాలు అంటూ మెగా బాస్ చిరంజీవి అంటూ స్టెప్స్ వేసింది. ఆ తర్వాత తోబా తోబా అంటూ గ‌బ్బ‌ర్ సింగ్ నే పడేసింది. ఇప్పుడు ఇదిగో ఇలాంటి కిర్రాక్ లుక్ తో వేడెక్కిస్తుంది . ఇవన్నీ చేయబట్టే ల‌క్ష్మీ రాయ్ కెరీర్ ల‌క్కీ రాయ్ గా వెలిగిపోతోంది.

కెరీర్ పరంగా .. రీసెంట్ గా ఒరు కుట్టనాద‌న్ బ్లాగ్ అనే మ‌ల‌యాళ చిత్రంలోనూ రాయ్ ల‌క్ష్మీ న‌టించింది. ప్ర‌స్తుతం `నీయ 2` సెట్స్ పై ఉంది. ఇది త‌మిళ్, తెలుగు రెండుచోట్లా రిలీజ్ కానుంది. ఇందులో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ తో క‌లిసి న‌టిస్తోంది. ఓవైపు హిందీ, మ‌రోవైపు త‌మిళం, తెలుగు, మ‌ల‌యాళం అన్ని చోట్లా ఏదో ఒక ఆఫ‌ర్ లక్ష్మీరాయ్ ని వ‌రిస్తూనే ఉన్నాయి.