సాయి పల్లవి ఎమోషనల్ హిట్ సినిమా డిజిటల్ రిలీజ్ కి వచ్చేస్తుందా.?

ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి స్టార్ హీరోయిన్స్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి కోసం అందరికీ తెలిసిందే. ఒక డాన్సర్ గానే కాకుండా అమేజింగ్ పెర్ఫామర్ గా కూడా సాయి పల్లవికి మంచి పేరు ఉంది.

ఇక వీటితో కలిపి ఆమెకి ఉన్న భారీ క్రేజ్ తో ఏకంగా లేడీ పవర్ స్టార్ అని ట్యాగ్ కూడా ఆమె సొంతం చేసుకుంది. ఇక ఈమె నటించిన రీసెంట్ సినిమాలు “విరాట పర్వం” అలాగే “గార్గి” చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యాయి. మరి ఈ చిత్రాల్లో ఆల్రెడీ విరాట పర్వం ఓటిటి లో రిలీజ్ కాగా..

ఇప్పుడు గార్గి థియేటర్స్ లో ఒక ఎమోషనల్ హిట్ గా బాగానే ప్రదర్శితం అవుతుంది. తెలుగులో డిజాస్టర్ అయ్యింది కానీ తమిళ్ లో అయితే రెండో వారం లోకి అడుగు పెట్టింది. ఇక ఈ సినిమా ఓటిటి డిజిటల్ రిలీజ్ పై అయితే డిజిటల్ ప్లాట్ ఫామ్ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తుంది.

దీని ప్రకారం అయితే ఈ చిత్రం ఈ ఆగస్ట్ రెండో వారం నుంచి అందుబాటులోకి తీసుకువస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా తెలుగు, తమిళ్ ఇతర భాషల స్ట్రీమింగ్ హక్కులని సోని లివ్ వారు కొనుగోలు చేశారు. మరి ఇందులోనే ఈ చిత్రం డిజిటల్ గా రిలీజ్ కాబోతుందట.