కృష్ణ‌వంశీతో బండ్ల గ‌ణేష్ మూవీ !

డైరెక్ట‌ర్ కృష్ణ వంశీ గ‌త మూడేళ్లుగా అవ‌కాశాలు లేక ఖాళీగా ఉంటోన్న సంగ‌తి తెలిసిందే. క‌థ‌లు ప‌ట్టుకుని తిరుగుతున్నా ఏ హీరో, నిర్మాత అవ‌కాశాలివ్వ‌డం లేదు. చంద‌మామ త‌ర్వాత చెప్పుకోద‌గ్గ ఒక్క హిట్ కూడా లేదు. డిజాస్ట‌ర్ల మీద డిజాస్ట‌ర్లు ఖాతాలో వేసుకున్నాడు. దీంతో హీరోలు, నిర్మాత‌లు అత‌ను ఔట్‌డేటెడ్ అయిపోయాడ‌ని డిసైడ్ అయిపోయారు.

న‌మ్మ‌కం కోల్పోయారు. బాల‌య్య 100 వ సినిమా కోసం స్కెచ్ వేసాడు గానీ పని అవ్వలేదు. రైతు క‌థ‌కు బాల‌య్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన‌ట్లే ఇచ్చి రెడ్ సిగ్నల్ వేసాడు. ఈ క్రియేటివ్ డైరెక్ట‌ర్ బాల‌య్య‌ను అడిగితే అదిగో చేద్దాం. ఇదిగో చేద్దాం అని వాయిదా వేస్తున్నాడు.