ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ టెన్ డైరెక్టర్స్‌లో కొరటాల శివ పేరుంటుంది. రచయితగా సినీ ప్రస్థానం మొదలు పెట్టిన కొరటాల, ఆ తర్వాత దర్శకుడిగా మారి సత్తా చాటుతున్నారు. తీసింది తక్కువ సినిమాలే అయినా, అన్నీ హిట్ సినిమాలే. సామాజికి అంశాలకు, టిపికల్ తెలుగు కమర్షియల్ హంగులు జోడించి సక్సెస్ సాధించారు శివ. దీంతో టాప్ హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా ఈ డైరెక్టర్‌తో సినిమా చేయాలని భావిస్తారు.
ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆచార్య సినిమాకి కొరటాల చాలా ఎక్కువ మొత్తంలోనే పారితోషకం అందుకోబోతున్నాడని సమాచారం. అయితే కరోనా కారణంగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఈ క్రమంలో ఆచార్య భారీ ప్రాజెక్ట్ కావడంతో, నిర్మాత పై భారం పెరగకూడదనే ఉద్దేశంతో కొరటాల శివ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.
ఆచార్య సినిమాకి కొరటాల తన పారితోషికాన్ని స్వచ్ఛందంగా తగ్గించుకున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆచార్య నిర్మాత అయిన రామ్ చరణ్‌కి తన నిర్ణయాన్ని చెప్పినట్లు ఇండస్ట్రీలో టాక్. దీంతో కొరటాల నిర్ణయానికి ఇండస్ట్రీ వర్గాలు సెల్యూట్ చేస్తున్నాయి. ఇక కరోనా కారణంగా అన్నీ సినిమా పరిశ్రమలు లాగానే టాలీవుడ్ కూడా సంక్షభంలో పడిన సంగతి తెలిసిందే. దీంతో గతంలో తీసినట్లు భారీ బడ్జెట్ చిత్రాలు ఇప్పట్లో వచ్చే అవకాశమేలేదు. హీరోలకు, హీరోయిన్లకు, దర్శకులకు భారీ పారితోషకాలు ఇచ్చే పరిస్థితుల్లో నిర్మాతలు లేరు. ఈ క్రమంలో నిర్మాతల పరిస్థితిని అర్ధం చేసుకుని, కొరటాల శివ తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరు అభినందించాల్సిందే.