కొరటాల శివకి ఈ కథానాయికల గోలేంటి?

బాబోయ్.. ఈ కథానాయికల గోలేంటి? అంటున్నాడట దర్శకుడు కొరటాల శివ. సోషల్ మీడియాలో నెటిజనులే కాదు, ప్రింట్ మీడియాలో సైతం తన చిత్రంలో కథానాయికలు ఎవరంటూ ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్లు కథలల్లుకుంటూ తెగ ఇదై పోతున్నారని దర్శకుడు శివ వాపోతున్నారట! ఇంతకీ అసలు విషయానికి వస్తే, ఈ గోలంతా చిరంజీవి 152వ సినిమా గురించేనట. తమన్నా, నయనతార, కాజల్ అగర్వాల్, బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్ అంటూ ఇలా ఎవరికి ఇష్టం వచ్చిన పద్ధతిలో వాళ్లు ఉహేంచేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేసుకుంటున్నారు.. ప్రింట్ మీడియాలో రాతలు రాసేసుకుంటున్నారు అని తల బాదుకుంటున్నాడట.

కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీపై రాంచరణ్ నిర్మాతగా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ సినిమా కోసం హైద్రాబాద్ శివారులో ఓ భారీ సెట్ తయారు చేస్తున్నారు. అక్కడే మొదటి షెడ్యూల్ తెరకెక్కనుంది. చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ను సమకూర్చనున్నారు 2020 వేసవికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై అప్పుడే ఇన్ని భారీ అంచనాలు.. భారీ ఊహాగానాలు చోటు చేసుకుంటుండడంతో పరిశ్రమలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అందుకు కారణాలు లేకపోలేదు… చిరంజీవి తాజా చిత్రం ” సైరా నరసింహారెడ్డి” పై భారీ అంచనాలు నెలకొనడమే ఎందుకు కారణం అని తెలుస్తోంది.

సైరా నరసింహారెడ్డి తర్వాత రాబోయే చిత్రం కావడంతో సహజంగానే అందరి దృష్టి చిరంజీవి 152వ సినిమాపై పడిందంటున్నారు. అయితే.. చిరు సరసన ఎవరైతే ఫ్రెష్ లుక్ వస్తుందో తమకు బాగానే తెలుసని దర్శకుడు కొరటాల శివ చెబుతున్నారట! అందరూ అనుకుంటున్నట్టు తమ చిత్రంలో ఈ హీరోయిన్ లెవరూ ఉండరని, తమ ఎంపిక ఎవరి ఊహకు అందకుండా ఉంటుందని ఆయన అంటున్నారట. నిజమేనా? అయితే తమన్నా, నయనతార, కాజల్ అగర్వాల్, బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్ కాక ఆ అదృష్టవంతురాలు ఎవరబ్బా?!