తన సినిమాల్లో సామాజిక బాధ్యతలను చొప్పించే కమర్షియల్ డైరెక్టర్ ఎవరైనా ఉంటే అది కోరటాల శివ మాత్రమే. రోబో శంకర్ మినహాయించి మరే ఇతర చిత్రనిర్మాత సామాజిక ఇతివృత్తాల కథలతో ముందుకు రాలేదు. కొరటాల గతంలో ఈ తరహాలో సామాజిక అంశాల్ని టచ్ చేశారు. తన తాజా ప్రయత్నాలు ఇదే తరహా.
ఆచార్య ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌లో మెగాస్టార్ చిరంజీవి ధర్మస్థలి ప్రజల కోసం ధర్మానికి కామ్రేడ్ గా నిలబడి ఉన్నారు. ప్రముఖ వ్యక్తి సమాజం కోసమే దుష్ట శక్తులకు వ్యతిరేకంగా ఎలా పోరాడుతాడో ఈ పోస్టర్ మనకు చెబుతుంది. ఇదివరకూ ఏఏ 21 థీమ్ పోస్టర్ చూశాక సామాజిక కథాంశమేనని అర్థమైంది. యువత నదికి అవతలి వైపు జరుగుతున్న అభివృద్ధి గురించి ఆందోళన చెందుతుండగా, ఈ తీరం నిర్వీర్యంగా పొడిగా కనిపిస్తుంది ఆ పోస్టర్ లో. కొరటాల మార్క్ పోస్టర్లు ఇవి.
అయితే సామాజిక ఇతివృత్తాలు ఎంచుకోవడానికి కారణం తన తల్లి అని కొరటాల తెలిపారు. కొరటాల తన తల్లి కఠినమైన కమ్యూనిస్ట్ అని పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు. వారికి కూడా అదే విధంగా నేర్పించారు. ట్యాలెంటెడ్ దర్శకుడు తన భావజాలాన్ని విడువక.. పెద్ద హీరోలతో మునుముందు వాణిజ్య చిత్రాల్ని తెరకెక్కిస్తూ సందేశాన్ని మిస్ కాకుండా ప్లాన్ చేస్తున్నాడు.
శ్రీమంతుడులోని పారదర్శకత, భరత్ అనే నేనులో జవాబుదారీతనం, జనతా గ్యారేజీలోని ప్రకృతి ప్రేమికుడు .. ఆచార్యలోని కామ్రేడ్ .. ఇవన్నీ నిజానికి కొరటాల శివ ఇతర అవతారాలు అని భావించాలి.