కియారాది రెండు పడవల ప్రయాణం!

అందాలతార కియారా అడ్వాణీది రెండు పడవల ప్రయాణం! ఇటు తెలుగు, అటు హిందీ రెండు
భాషల్లోనూ నటిస్తూ రెండు పడవల ప్రయాణం కొనసాగిస్తోంది. తెలుగులో మహేష్ బాబుతో చేసిన ‘భరత్ అనే నేను’లో నటిగా కియారాకు మంచి మార్కులు లభించాయి. తాజా హిందీ చిత్రం కబీర్ సింగ్ లో షాహిద్ కపూర్ కు జోడీగా నటించి తారగా అందరి హృదయాల్లో చోటు సంపాదించుకుంది.. ఈ ఏడాది వచ్చిన హిందీ సినిమా ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’, అంతకు ముందు ‘నమస్తే ఇంగ్లాండ్‌’, ‘తుమ్‌ బిన్‌ 2’ తదితర చిత్రాలు సైతం కియారా కెరీర్ కు ఎంతగానో ఉపయోగ పడ్డాయి. తాజాగా ‘ఇందూ కీ జవానీ’లో ఓ విభిన్నమైన పాత్రని పోషిస్తోంది. ఇందులో ఆదిత్య సియల్‌ హీరోగా నటించనున్నాడు.

ఈ సినిమాలో అతనికి జోడీగా కనిపించనుంది. డేటింగ్‌ యాప్స్‌లో నచ్చిన అబ్బాయిని ఎంపిక చేసుకుని, అతనితో డేటింగ్‌ చేసే అమ్మాయి పాత్రలో కియారా అడ్వాణీ నటించనున్న సినిమా ‘ఇందూ కీ జవానీ’. వినోదాత్మకంగా రూపొందనుందీ చిత్రం. నిజ జీవితంలో మాత్రం తానెప్పుడూ డేటింగ్‌ యాప్స్‌లోకి వెళ్లలేదని, కొందరు స్నేహితులు చెప్పిన కథలు వింటే నవ్వొచ్చిందని కియారా పేర్కొన్నారు. ఇలా రెండు పడవల ప్రయాణం కొనసాగిస్తున్నారు ఇంతకీ మీ ప్రాధాన్యత ఏ భాషకు? అని కియారాను అడిగితే- నాకు తెలుగు, హిందీ రెండు భాషలూ ఇష్టమే. వీరిలో ఎక్కువ అవకాశాలు ఎక్కడ లభిస్తే అక్కడే కెరీర్ ని కొనసాగిస్తాను అంటూ చెప్పు కొచ్చింది కియారా!