తోబుట్టువుల ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ అని నటుడు యశ్ అన్నారు. గురువారం రాఖీ పండుగ సందర్భంగా తన చెల్లెలు నందినితో రాఖీ కట్టించుకుని ఆ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడు చేశారు. యశ్ భార్య రాధిక పండిత్ ఆమెరికాలోని తన సోదరుడికి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. చిన్ననాటి ఫోటోలను ఆమె సామాజిక మాధ్యమాలకు అప్‌లోడ్ చేశారు.