బెల్లంకొండ శ్రీనివాస్ ‘కవచం ‘చిత్రం సెన్సార్ కబుర్లు

బెల్లంకొండ శ్రీనివాస్ , కాజల్ అగర్వాల్ ,మెహ్రీన్ , నితిన్ ముకేష్ ,హర్షవర్ధన్ రాణే ,అజయ్ , సత్యం రాజేష్ , పోసాని తదితరులు నటించారు .

వంశధార క్రియేషన్స్ బేనర్ పై నవీన్ శొంఠినేని శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వంలో నిర్మించిన యాక్షన్ చిత్రం .

బెల్లంకొండ ఈ చిత్రంలో పోలీస్ అధికారిగా నటించాడు . ఒక రాణిని కాపాడే కవచంలా ఉంటానని, పోలీస్  వ్యవస్థ కోసమే పనిచేస్తాడనే పాత్ర .

ఈ చిత్రానికి సెన్సార్ వారు యు /ఏ సర్టిఫికెట్ ఇచ్చారు . యాక్షన్ సినిమా కాబట్టి కట్స్ లేకుండా యు /ఏ ఇచ్చినట్టు తెలిసింది చోటాకె నాయుడు ఛాయాగ్రహం , తమన్  సంగీతం  ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు .

పోలీస్ అధికారి పాత్రలో శ్రీనివాస్ ను దర్శకుడు శ్రీనివాస్ బాగా చూపించాడు , పాటల్లోనూ, ఫైట్స్ లోను శ్రీనివాస్ మెప్పించాడు . కవచం చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని 7వ తేదీన విడుదలవుతుంది ..