విజయ్ దేవరకొండ, రష్మిక ల ‘డియర్ కామ్రేడ్’ సినిమా బాగానే ఆదరణకు నోచుకుంది. మిశ్రీత స్పందన వచ్చిన సినిమా బాగానే నడుస్తోంది కాబట్టి ఇప్పుడు రీమేక్ ప్రస్తావన మళ్ళీ తెర పైకి వచ్చింది. సినిమా విడుదలకు రెండు రోజుల ముందు బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమా రీమేక్ రైట్లు కొన్నారని ప్రచారం హోరెత్తించారు.
ఏమో అనుకున్నారు కానీ ఆయన 5 కోట్లకు ఈ చిత్రం రీమేక్ రైట్లను కొన్నారట. ఇకపోతే ఈ సినిమాను కొద్దీ పాటి మార్పులతో హిందీలో తీయనున్నారు. బాబీ వైపు నుంచి కథను చెప్పడం కాకుండా లిల్లి వైపు నుంచి కథను చెబుతారట. ఇంకా ఏమేం చెప్తారో వేచి చూద్దాం.