క్లాసిక్ టచ్ తో…కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం టైటిల్ లోగో (వీడియో)

నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం రీసెంట్ గా లాంచ్ అయ్యిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సతీష్ వేగేశ్న దర్శకత్వంలో చేస్తున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్ గా మెహ్రీన్ నటిస్తుంది. కాగా నేడు కళ్యాణ్ రామ్ పుట్టిన రోజున పురస్కరించుకొని ఈ మూవీ టైటిల్ లోగోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. కళ్యాణ్ రామ్ 17వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి “ఎంత మంచివాడవురా” అనే క్లాసిక్ టైటిల్ నిర్ణయించారు.

https://www.youtube.com/watch?time_continue=53&v=9bx44ocToIY

వర్షంలో తడుస్తున్న ఇద్దరు చిన్నారులకు మొక్కజొన్న కండి కొనిచ్చి సైకిల్‌పై వెళ్తున్న సమయంలో ‘ఎంత మంచివాడవురా’ అంటూ అక్కినేని నటించిన ‘నమ్మినబంటు’ చిత్రంలోని పాటతో విడుదల చేసిన ఈ టైటిల్‌ టీజర్‌ ఆకట్టుకుంది.

తన గత చిత్రాలకు “శతమానంభవతి”, “శ్రీనివాస కళ్యాణం” వంటి అచ్చ తెలుగు పేర్లు పెట్టిన దర్శకుడు సతీష్ ఈ సారి కళ్యాణ్ రామ్ చిత్రానికి కూడా అలాంటి సంప్రదాయబద్దమైన టైటిల్ నే ఎంచుకోవడం గమనార్హం.

పూర్తి స్దాయి కుటుంబ కథా నేపథ్యంలో తెరకెక్కనున్న “ఎంత మంచివాడవురా” చిత్రాన్ని ప్రముఖ మ్యూజిక్ సంస్థ ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఉమేష్ గుప్తా నిర్మిస్తుండగా ,శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందిస్తున్నారు.