చిరు అల్లుడి రెండో సినిమా ఆగిపోయిందా !

చిరంజీవి రెండో అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ విజేత సినిమాతో వెండితెర‌కి ప‌రిచ‌యం అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా పెద్ద‌గా అల‌రించ‌క‌పోవ‌డంతో రెండో సినిమాపై పూర్తి దృష్టి పెట్టాడు క‌ళ్యాణ్‌. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ సంస్థలో క‌ళ్యాణ్ త‌న రెండో సినిమా చేస్తుండ‌గా, ఈ సినిమాని పులి వాసు తెర‌కెక్కించ‌నున్నాడు. ఈ చిత్రంతో వాసు ద‌ర్శ‌కుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ షెడ్యూల్ ప్రారంభ‌మై చాలా రోజులే అవుతున్న‌, రెండో షెడ్యూల్ ఇప్ప‌టికి ప్రారంభించ‌లేదు. ఫ‌స్ట్ షెడ్యూల్‌లో సీన్స్ చూసిన టీం ఏ మాత్రం నచ్చలేదు.

టీం వాళ్ళకి అందునా ఇప్పటికే వైజాగ్ షెడ్యూల్ కె 4 కోట్లు ఖర్చు అయింది. సినిమా టోటల్ బడ్జెట్ 4 అని ఒకే షెడ్యూల్ కి 4 పెట్టించారు అని ప్రొడ్యూసర్ లబో దిబో అంటున్నాడు. దీంతో చిత్ర షూటింగ్‌కి బ్రేక్ ప‌డ్డ‌ట్టు టాక్ న‌డుస్తుంది. .సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళీ, ప్రగతి కీలక పాత్రల్లో నటించనున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతమందిస్తున్నారు.