మెగా మాజీ అల్లుడు కళ్యాణ్ దేవ్ గురించి పరిచయం అవసరం లేదు. ఈయన చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజను రెండవ వివాహం చేసుకున్న తర్వాత హీరోగా విజేత సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఈ విధంగా కళ్యాణ్ పలు సినిమాలలో నటించే సందడి చేశారు. ఇక శ్రీజ కళ్యాణ్ దేవ్ ల వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుందనుకున్న సమయంలో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తయని దీంతో వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారని వార్తలు సోషల్ మీడియాలో గత కొంతకాలంగా వస్తూనే ఉన్నాయి.
ఇలా వీరిద్దరూ విడాకుల గురించి ప్రకటన ఇవ్వకపోయినా ఇద్దరు కూడా ఒంటరిగా గడుపుతున్నారు. అయితే శ్రీజ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న తన గురించి తన పిల్లల గురించి మాత్రమే అభిమానులతో పంచుకుంటారు. ఇక కళ్యాణ్ దేవ్ సైతం తన స్నేహితులతో కలిసి పలు వెకేషన్ లకి వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోని వీరిద్దరూ ఒంటరిగా వేరువేరుగా ఉండడంతో వీరికి విడాకులు వచ్చాయని అయితే ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదని తెలుస్తుంది.
ఇకపోతే కళ్యాణ్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఈయన ఇన్స్టాగ్రామ్ వేదికగా తన ఫోటోని షేర్ చేస్తూ.. కాస్త ఓపిక పట్టండి అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి అంటూ చెప్పుకొచ్చారు.ఈ క్రమంలోనే ఈ పోస్టు వైరల్ కావడంతో ఈయన పోస్ట్ కు అర్థం ఏంటి త్వరలోనే వీరిద్దరూ విడాకులు తీసుకున్నామని అధికారికంగా ప్రకటించబోతున్నారా అంటూ పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.