క‌ళ్యాణ్ దేవ్, రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడ‌క్ష‌న్ నెం 2 ప్రారంభం..

తొలి సినిమా విజేత తోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో కళ్యాణ్ దేవ్ రెండో సినిమా ఖరారైంది.. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమా ని నిర్మిస్తుంది..నూతన దర్శకుడు పులి వాసు దర్శకత్వం వహిస్తున్నారు.. త్వరలో
షూటింగ్ ప్రారంభం కానుంది..  ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తుండగా ఖుర్షీద్ (ఖుషి) సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.. ఈ సినిమా లో రాజేంద్రప్రసాద్, నరేష్ వీకే, పోసాని కృష్ణ మురళి, ప్రగతి ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు..త్వరలోనే  మిగితా ఆర్టిస్టులు, టెక్నిషియన్ల వివరాలు వెల్లడిస్తామని నిర్మాత రిజ్వాన్ తెలిపారు..

నటీనటులు: కల్యాణ్ దేవ్, రాజేంద్రప్రసాద్, నరేష్ వీకే, పోసాని కృష్ణ మురళి, ప్రగతి

సాంకేతిక నిపుణులు :
దర్శకుడు: పులి వాసు
నిర్మాత: రిజ్వాన్
బ్యానర్: రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్
సహ నిర్మాత: ఖుర్షీద్ (కుషి)
సంగీతం: ఎస్ఎస్ తమన్
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
సహ దర్శకులు: డి. రాజేంద్ర, రవి
సాహిత్యం: కేకే
ప్రొడక్షన్ కంట్రోలర్: రషీద్ అహ్మద్ ఖాన్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: రాజు
PRO: వంశీ-శేఖర్