మెగా అల్లుడి బ‌ర్త్ డే స్పెష‌ల్.. స‌ర్‌ప్రైజ్ వీడియోతో సంద‌డి చేసిన రామ్ చ‌ర‌ణ్‌

మెగాస్టార్ చిరంజీవి ముద్దుల కూతురు శ్రీజ ప‌లు కార‌ణాల వ‌ల‌న మొద‌టి భ‌ర్త‌కు విడాకులు ఇచ్చి రెండో పెళ్లిగా క‌ళ్యాణ్ దేవ్ అనే వ్య‌క్తిని వివాహ‌మాడిన సంగ‌తి తెలిసిందే. ఇతని ముఖంలో మంచి క‌ళ ఉండ‌డంతో పెళ్లైన కొద్ది రోజుల‌కే విజేత సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా పెద్ద‌గా అల‌రించ‌లేక బాక్సాఫీస్ ద‌గ్గ‌ర చ‌తికిల ప‌డింది. ప్ర‌స్తుతం క‌ళ్యాన్ సూప‌ర్ మ‌చ్చి, కిన్నెర‌సాని అనే చిత్రాలు చేస్తున్నాడు. సూప‌ర్ మ‌చ్చి చిత్రం పులివాసు దర్శక‌త్వంలో తెర‌కెక్కింది. రిజ్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రిజ్వాన్‌, ఖుషి నిర్మిస్తున్నారు. రచితారామ్‌ కథానాయిక. కుటుంబ విలువలతో అందమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని రూపొందించారు.

Kinnera | Telugu Rajyam

ఇక కళ్యాణ్ దేవ్ ఇప్పుడు త‌న మూడో సినిమాగా కిన్నెరసాని అనే చిత్రం చేస్తున్నారు. అశ్వద్ధామ ఫేమ్ ర‌మ‌ణ తేజ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ స్నేహితుడు, ప్ర‌ముఖ నిర్మాత రామ్ త‌ళ్లూరి నిర్మాణ సార‌థ్యంలో ఎస్. ఆర్. టి ఎంటర్ టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి దేశరాజ్ సాయి తేజ్ కథ – కథనం అందిస్తున్నారు. న్యూ ఇయ‌ర్ కానుక‌గా కిన్నెర సాని చిత్రానికి సంబంధించి టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా, ఈ రోజు క‌ళ్యాణ్ దేవ్ బ‌ర్త్‌డే సంద‌ర్బంగా ‘థీమ్ ఆఫ్ కిన్నెరసాని’ ని రిలీజ్ చేశారు.ఇది ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

థీమ్ ఆఫ్ కిన్నెర‌సాని వీడియోలో కాలుతున్న పేప‌ర్ గాల్లో ఎగురుకుంటూ రావ‌డం, మ‌ధ్య‌లో లాంత‌ర్ ప‌ట్టుకున్న వ్య‌క్తిని చూపించ‌డం, అనంత‌రం లా అండ్ ఆర్డర్ కి సంబంధించిన ఇమేజ్ రావ‌డం, చివ‌ర‌లో క‌ళ్యాణ్ దేవ్ ఇమేజ్ ని చూపించ‌డం సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ మహతి సాగర్ అందించిన నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది. ఇందులో విజువల్స్ ఒక మంచి పెయింటింగ్ చూస్తున్న అనుభూతిని కలిగిస్తున్నాయి. శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం స‌మ్మ‌ర్‌లో రిలీజ్ కానున్న‌ట్టు తెలుస్తుంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క స‌క్సెస్ కూడా అందుకోలేక‌పోయిన క‌ళ్యాణ్ దేవ్ ఈ రెండు సినిమాల‌తో అయిన హిట్ రుచి చూస్తాడా అనేది చూడాలి. కాగా, థీమ్ ఆఫ్ కిన్నెర‌సాని వీడియోను రామ్ చ‌ర‌ణ్ విడుదల చేశారు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles