సీక్రెట్‌గా వీడియో తీసిన కళ్యాణ్ దేవ్.. ఉలిక్కిపడిన శ్రీజ!!

Kalyaan Dhev And Sreeja Enjoys In Maldives

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి అందరికీ తెలిసింది. మీడియాకెక్కి మెగా ఫ్యామిలీని ఎలా రచ్చ చేసిందో తెలిసిందే. ఇప్పుడు ఆ గతం గురించి పక్కన పెడితే.. ప్రస్తుతం కళ్యాణ్ దేవ్‌తో సంతోషంగా గడుపుతోంది. ఈ ఇద్దరికీ నవిష్క అనే కూతురు కూడా ఉంది. ప్రస్తుతం జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పండుగలకు పబ్బాలకు మెగా ఇంట్లో సందడి చేసే శ్రీజ ఫ్యామిలీ ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్నట్టు కనిపిస్తోంది.

Kalyaan Dhev And Sreeja Enjoys In Maldives
Kalyaan Dhev And Sreeja Enjoys In Maldives

చూస్తుంటే శ్రీజ, కళ్యాణ్ మాత్రమే మాల్దీవుల్లో ఎంజాయ్ చేసేందుకు వెళ్లినట్టు కనిపిస్తోంది. నివృత్తి, నవిష్క చిరంజీవి ఇంట్లో ఉన్నారని అర్థమవుతోంది. ఎందుకంటే మొన్నీ మధ్య చిరంజీవి తన మనవరాళ్లైన సంహిత, నివృత్తిలకు కేఎఫ్‌సీ చికెన్ చేసి పెట్టాడు. అలా నివృత్తి మాల్దీవుల్లో లేదని అర్థమవుతోంది. అయితే కళ్యాణ్ దేవ్, శ్రీజలు మాత్రం మాల్దీవుల్లో ఫుల్ ఎంజాయ్ చేస్తోన్నట్టు తెలుస్తోంది. అయితే తాజాగా కళ్యాణ్ దేవ్ ఓ వీడియోను షేర్ చేశాడు.

ఆ వీడియో సీక్రెట్‌గా తీశాడు. కళ్యాణ్ దేవ్ ఇలా సీక్రెట్‌గా వీడియో తీస్తున్నాడని తెలియక శ్రీజ తన పనిలో తాను నిమగ్నమైంది. వంటగదిలో తన పాటికి తాను ఏదో చూసుకుంటూ పాటను హమ్ చేస్తూ చిన్నగా స్టెప్పులు వేసింది. ఈ వీడియో తీస్తున్నాడని తెలిశాక భర్తను శ్రీజ కొట్టబోయింది. మొత్తానికి ఈ ఇద్దరు మాత్రం మాల్దీవుల్లో ఫుల్ సందడి చేస్తున్నారు. కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం సూపర్ మచ్చి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మధ్య షూటింగ్ కూడా పూర్తి చేశాడు.