శ్రీజ బెడ్రూంలో అలా.. నిహారిక వీడియోతో బయటపడింది!!

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ సోషల్ మీడియాలో ఈ మధ్య ఫుల్ యాక్టివ్ అయింది. ఫ్యామిలీ విషయాలను పంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది. నవిష్కతో ఆడుకుంటూ తన ముద్దు ముద్దు మాటలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. నేడు (నవంబర్ 10) శ్రీజ బర్త్ డే. శ్రీజ బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసేందుకు కళ్యాణ్ దేవ్ మాల్దీవుల ట్రిప్ ప్లాన్ చేసినట్టున్నాడు.

ప్రస్తుతం ఈ జంట మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. అదిరిపోయే కాటేజ్.. చుట్టూ సముద్రం, వెన్నెలను చూస్తూ, క్యాండిల్ లైట్ డిన్నర్లు చేస్తున్నారు. ఈ మధ్య అందరూ మాల్దీవులకే చెక్కేస్తున్నారు. తాజాగా కాజల్ కూడా హనీమూన్ కోసం అక్కడికే వెళ్లింది. ఇలా భార్య బర్త్ డేను కళ్యాణ్ దేవ్ గ్రాండ్‌గానే జరిపాడు. అయితే నిహారిక షేర్ చేసిన ఓ వీడియో ద్వారా శ్రీజ తన బెడ్రూంలో ఎలా ఉంటుందో తెలిపోయింది.

శ్రీజ తన చిన్న కూతురు నవిష్కతో ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. నవిష్క అంటే నిహారికకు కూడా ఎంతో ముద్దు. శ్రీజ తన కూతురితో ఆడుకుంటూ ఉండగా నిహారిక వీడియో తీసింది. అందులో నవిష్క శ్రీజను ఓ రేంజ్‌లో ఆడుకుంటోంది. నవిష్క అల్లరిని శ్రీజ తట్టుకోలేకపోయింది. మొత్తానికి అక్క బర్త్ డేకు నిహారిక ఇలా సర్ ప్రైజ్ ఇచ్చింది.