కాజల్ అగర్వాల్ తృప్తికి కారణం అదేనట!?

స్టార్‌ హీరోయిన్ కాజల్‌ అగర్వాల్  ప్రస్తుతం చిరంజీవి ‘ఆచార్య’, కమల్‌ హాసన్‌ ‘ఇండియన్‌ 2’, మంచు విష్ణు ‘మోసగాళ్ళు’ చిత్రాలు చేస్తూ బిజీ బిజీగా కాలం గడుపుతోంది. అయితే ఈ సమయంలో  మంచి ఊపుమీదున్న కాజల్ కరోనా వల్ల షూటింగ్‌లు ఆగిపోవడంతో ఇంట్లోనే ఉంటూ లాక్‌డౌన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.
 
కాగా,  ప్రచార హడావుడి లేకుండా సామాజిక సేవ చేయడంలో ముందుంటారు కాజల్‌. అరకు ఏజన్సీ ప్రాంతంలో అత్యంత వెనుకబడిన గిరిజన పిల్లలకు ఉచిత విద్య, బాలికలు, యువతుల ఆరోగ్యానికి సంబంధించిన సేవలు, శానిటైజేషన్‌ లాంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు.  
 
ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ  కాజల్‌ అగర్వాల్‌ నెటిజనుల ప్రశంసలు అందుకుంటోంది. ‘నాకు ఇందులోనే ఎంతో తృప్తి ఉంది’ అని చెబుతోంది కాజల్.