బాలయ్య గా ఎన్టీఆర్…మీడియా వండిన మసాలేనా?

రెండు రోజుల  నుంచి సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. బాలకృష్ణ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారని. అంటే..బాలయ్య సినిమాని ఎన్టీఆర్ రీమేక్ చేస్తున్నట్లు కాదు. బాలకృష్ణ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్ లో …ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ పాత్రలో ఎన్టీఆర్  కనపడబోతున్నారని. అయితే ఈ వార్త..నిన్న అరవింద సమేత సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్, బాలయ్యలను చూసి వండేసిన వ్యవహారంలాగే కనపడుతోంది. తప్ప నిజమయ్యేటట్లు లేదని కొందరంటున్నారు.

మొదటి నుంచీ ‘ఎన్టీఆర్’ బయోపిక్ లో బాలయ్య పాత్రను ఆయన కుమారుడు మోక్షజ్ఞ చేస్తాడంటూ వినపడ్డాయి. అయితే రీసెంట్ గా హరికృష్ణ మృతి తర్వాత మారిన కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో బాలయ్య పాత్రను ఎన్టీఆర్ చేస్తారని చెప్పుకుంటున్నారు.

నిజానికి ఈ వార్త నిజమే అయితే…ఎన్టీఆర్  ఈ బయోపిక్ లో ఉంటే సినిమా బిజినెస్ రెట్టింపు అవుతుంది. స్థాయి అమాంతం పెరుగుతుంది. అయితే ఎన్టీఆర్, బాలకృష్ణ దానికి ఒప్పుకోవాలి. ఈ వార్త నిజమే అయితే  అరవింద సమేత చిత్రం సక్సెస్ వేడుకలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించి,  పోస్టర్ ను కూడా విడుదల చేసేసేవారు. అలాంటిదేమీ జరగలేదు కాబట్టి ప్రస్తుతానికి ఇది మీడియా వండిన మసాలా వంటకమే అని సరిపెట్టుకోవాలి.